KCR Udhayanidhi Stalin

జాతీయ స్థాయిలో రాజకీయాలను మోడీ, అమిత్ షాలు శాసిస్తున్నారనేది రహస్య విషయం కాదు. ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటుండటం, మూస రాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటంతో జాతీయస్థాయిలో రాణించలేకపోతోంది.

ఈ రెండు జాతీయ పార్టీలు గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, కేరళ, కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలలో బలంగా ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా ఉంటోంది. కనుక కాంగ్రెస్‌, బీజేపి రెండూ వాటిని కూడా కలుపుకొని ముందుకు సాగాల్సి వస్తోంది.

Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి

బిఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, ఆమాద్మీ, తృణమూల్ కాంగ్రెస్‌ వంటి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపిలకు దూరంగా ఉంటూ తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి.

కేసీఆర్‌ తన నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌, బీజేపిలను ఎదుర్కొని , జాతీయరాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నించారు. కానీ కూతురు కల్వకుంట్ల కవిత మద్యం కేసులో చిక్కుకొని జైలు పాలవడంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు.

Also Read – వైసీపీ చరిత్ర బయటవారే చెప్పాలా… వద్దు!

కనుక ఇటువంటి పార్టీలు చేతులు కలిపేందుకు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్రం ప్రతిపాదన ఓ మంచి అవకాశంగా కనిపించడం సహజం.

తమిళనాడు సిఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో నేడు నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ తరపున కేటీఆర్‌ హాజరవుతున్నారు. కర్ణాటక, కేరళ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

Also Read – సంగీతంలో లెజెండ్ – మీడియా అంటే ఆమడ దూరం. వివాదాల భయమా?

అయితే వారు నిజంగానే ఈ ప్రతిపాదనని అడ్డుకునేందుకు పోరాడాలనుకుంటున్నారా?ఈ పేరుతో కూటమిగా ఏర్పడి మోడీ, అమిత్ షాలను, బీజేపిని నిలువరించాలనుకుంటున్నారా?లేదా మోడీ, అమిత్ అమిత్ షా, బీజేపిల నుంచి తమని తాము కాపాడుకునేందుకు అందరూ కలిసి ఈ పేరుతో రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటున్నారా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం తప్పక లభిస్తుంది.

అయితే ఆర్టికల్ 370 రద్దు, బాబ్రీ- రామజన్మభూమి వివాదం, ట్రిపుల్ తలాక్ వంటి అత్యంత సంక్లిష్టమైన అంశాలలోనే వెనక్కు తగ్గని కేంద్రం, ఈ సమావేశంలో పాల్గొనే నేతల ఒత్తిడి కారణంగా తన ప్రతిపాదనని వెనక్కు తీసుకుంటుందనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు.

కానీ ఈ సమావేశం, తదనంతర పరిణామాల కారణంగా ఎప్పటికైనా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలనే బీజేపి ప్రయత్నాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే తమిళనాడులో బీజేపి ప్రవేశాన్ని అడ్డుకునేందుకు డీఎంకే పార్టీ త్రిభాషా విధానాన్ని అస్త్రంగా ప్రయోగిస్తోంది. ఇప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

కనుక బీజేపి కూడా దీనికి ప్రతి వ్యూహం అమలుచేయక తప్పదు. డీఎంకేపై కేంద్రం ప్రయోగించబోయే ఆ అస్త్రం పేరు బహుశః ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌-సనాతన ధర్మం కావచ్చు.

కనుక ఈ అంశంతో కేంద్ర రాష్ట్రాల మద్య, అలాగే బీజేపి, బీజేపియేతర పార్టీల మద్య యుద్ధం ఆరంభమయ్యే అవకాశం ఉంది.




తమిళనాడు సిఎం స్టాలిన్ ఈ యుద్ధానికి నాయకత్వం శ్రీకారం చుట్టారు కనుక కేసీఆర్‌ చేధించలేని జాతీయ లక్ష్యాన్ని స్టాలిన్ చెందించగలరా? లేదా తమిళనాడులో బీజేపి అడుగుపెట్టకుండా అడ్డుకుంటే చాలని సరిపెట్టుకుంటారా?చూడాలి.