వైసిపి భయాలు నిజం కాబోతున్నాయా?

TDP BJP Alliance is ysrcp afraid  ఇంతకాలం వైసీపీ ఏమి జరుగుతుందని భయపడుతోందో అదే జరుగబోతోంది. ఏది జరగకూడదనుకొందో అదే జరుగబోతోంది. టిడిపి బిజెపిలు మళ్ళీ చేతులు కలపబోతున్నాయి. టిడిపి ఎన్డీయే కూటమిలో చేరబోతోంది. ఈ విషయం టిడిపి, బిజెపిలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఓ జాతీయ న్యూస్ ఛానల్‌ బ్రేకింగ్ న్యూస్‌లో దీనిని బయటపెట్టింది. త్వరలోనే టిడిపి,బిజెపిలు మళ్ళీ చేతులు కలపబోతున్నాయని, టిడిపి ఎన్డీయే కూటమిలో చేరబోతోందని చెప్పింది.

ఏపీలో టిడిపి, బిజెపిలను మళ్ళీ కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెపుతూనే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో ఆ రెండు పార్టీలు మళ్ళీ దగ్గరవడం, ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చంద్రబాబు నాయుడుని ఆప్యాయంగా పలకరించి మాట్లాడటం, ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈనాడు అధినేత రామోజీరావుతో భేటీ అవడం వంటివన్నీ అందరూ చూశారు. వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నిటినీ చూస్తే టిడిపి, బిజెపిల మద్య తెర వెనక ఏదో జరుగుతోందని అర్దమవుతూనే ఉంది. అదే ఇప్పుడు జాతీయ న్యూస్ ఛానల్ (రిపబ్లిక్ టీవీ) కూడా చెప్పింది.

ADVERTISEMENT

ఈ పరిణామాలని వైసీపీ చాలా ముందే ఊహించింది. అందుకే ఆందోళన చెందుతూ దుష్టచతుష్టయం పేరుతో విషం చిమ్ముతోంది. సిఎం జగన్ వద్దనుకొంటే రాజధాని నిర్మాణం నిలిపివేయవచ్చు… పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేయవచ్చు… కానీ టిడిపి,బిజెపిలు చేతులు కలపాలనుకొంటే ఆపలేరు. ఇప్పుడు అదే జరుగబోతోంది. త్వరలోనే టిడిపి, బిజెపిలు అధికారికంగా ఈ విషయం ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Watch and subscribe for Exclusive Interviews:

ADVERTISEMENT
Latest Stories