కోర్టులో ‘జగన్… జగన్…’ అని ఎన్నిసార్లు పిలుస్తారు?

tdp-cm-ramesh-satires-on-ys-jagan-10000-cr-black-moneyఅవినీతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. జగన్ కు సంబంధించిన వేల కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసిందని అన్నారు. హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి పది వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారనగానే అందరూ గతంలో ఇలాంటి నేరాలు చేసిన వారివైపు చూస్తారని అన్నారు.

ADVERTISEMENT

ప్రతి శుక్రవారం కోర్టులో జగన్ పేరును ‘జగన్… జగన్…’ అంటూ 33 సార్లు పిలుస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటి వ్యక్తి అవినీతిపై ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదమని, అయినా అవినీతి పరులను పట్టివ్వమని కోరడం మంచిదేనని ఆయన తెలిపారు. అయితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవద్దని హితవు పలికారు. దేశ ప్రజలందరికీ ఎవరు అవినీతితో ఆస్తులు సంపాదించారో తెలుసని అన్నారు సిఎం రమేష్.

ADVERTISEMENT
Latest Stories