TDP MP Galla Jaydevటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి సంబరపడుతున్న వైసీపి ప్రభుత్వానికి నేటి నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగబోతున్నాయనే విషయం మరిచిన్నట్లుంది. లేకుంటే అవి ముగిసిన తర్వాతే అరెస్ట్ చేసి ఉండేది. కానీ దుండుకుతనం ప్రదర్శించి ఈ సమస్యను పార్లమెంట్‌లో టిడిపి సభ్యులు ప్రస్తావించేందుకు చేజేతులా అవకాశం కల్పించింది.

పార్లమెంట్‌లో ఈ సమస్యను ప్రస్తావించినంత మాత్రాన్న ఏదో అద్భుతంగా జరిగిపోయి చంద్రబాబు నాయుడు విడుదలవుతారని కాదు. కానీ పార్లమెంట్‌ వేదికగా ఏపీలో జగన్‌ ప్రభుత్వ ఏవిదంగా ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందో యావత్ దేశం దృష్టికి, ముఖ్యంగా ఇంకా మౌనం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకువెళ్ళగలిగారు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్.

గలా జయదేవ్ ఈ అంశంపై లోక్‌సభలో మాట్లాడుతుండగా వైసీపి ఎంపీ మిథున్ రెడ్డి పదేపదే లేచి అక్కడ కూడా ఆయన పట్ల అనుచితంగా మాట్లాడటం వైసీపి నేతల సంస్కృతికి అద్దం పడుతోందని చెప్పవచ్చు. అయితే గల్లా జయదేవ్ మిథున్ రెడ్డి ఉచ్చులో చిక్కుకుండా స్కిల్ డెవలప్‌మెంట్‌తో చంద్రబాబు నాయుడు వేలాదిమంది యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు లభించేలా చేశారని, అటువంటి విషయాన్ని వైసీపి వక్రీకరించి, భూతకాపు కేసు బనాయించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించిందని చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పారిశ్రామిక అభివృద్ధి, ఐ‌టి కంపెనీలను రాష్ట్రానికి తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు తప్ప అవినీతికి పాల్పడరని చెప్పారు. సీమెన్స్ కంపెనీ మాజీ డైరెక్టర్ స్వయంగా దీనిలో ఎటువంటి అవినీతి జరుగలేదని ఢిల్లీలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పినా వైసీపి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడుపై ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందని చెప్పారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంలో కలుగజేసుకొని చంద్రబాబు నాయుడుకి న్యాయం చేయాలని గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.