అమరావతి రైతు దీక్షల్లాగే టిడిపి దీక్షలు కూడా?

TDP-Protest-for-Chandrababu-Naiduటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఓవైపు న్యాయపోరాటాలు చేస్తూనే, మరోవైపు ఆయన అరెస్టుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు దీక్షలు చేస్తున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తుందని, అప్పుడు ఆయన వెంటనే విడుదలై బయటకు వచ్చేస్తారని టిడిపి నేతలు, కార్యకర్తలు భావించి చాలా ధైర్యంగా మాట్లాడారు.

కానీ మోడీ, అమిత్ షాలు అసలు పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. అంటే ఈ వ్యవహారంలో జగన్‌ ప్రభుత్వం ముందుకు సాగవచ్చని వారు సిగ్నల్ ఇచ్చిన్నట్లే అయ్యింది. అందుకే జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తోందని భావించవచ్చు.

ADVERTISEMENT

కారణాలు ఏవైనప్పటికీ చంద్రబాబు నాయుడుకి 15 రోజులైనా బెయిల్ లభించలేదు. బహుశః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఖరి కారణంగా ఏ కేసులోను ఆయనకు ఉపశమనం లభించడం లేదు. ఏసీబీ, హైకోర్టులో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏపీ సీఐడీ అధికారులకు చంద్రబాబుని ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది కూడా.

టిడిపికి ఇది నిజంగానే చాలా కష్టకాలమని అర్దమవుతూనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇది చాలా సహజం కూడా. కనుక రోజులు గడుస్తున్న కొద్దీ టిడిపి దీక్షలపై ప్రజలకు కూడా ఆసక్తి తగ్గుతోంది. దీంతో టిడిపి దీక్షలు కూడా అమరావతి రైతు దీక్షల్లా సుదీర్గంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే అమరావతి రైతుల్లాగే టిడిపి కూడా వాటితో జగన్‌ ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి చేయలేకపోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను తప్పక ఆలోచింపజేస్తాయి. వారి అభిప్రాయాలు ఓట్ల రూపంలో మారితే వచ్చే ఎన్నికలలో వైసీపి ఇందుకు మూల్యం చెల్లించవలసి వస్తుంది.

కానీ చంద్రబాబు నాయుడు ఇంకా ఎప్పుడు విడుదలవుతారు?విడుదలైనా మళ్ళీ అరెస్ట్ కాకుండా తప్పించుకోగలరా?ఆయన విడుదలయ్యే వరకు టిడిపి దీక్షల ద్వారా ఈ వేడి తగ్గకుండా మెయిన్‌టెయిన్ చేయగలదా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories