పార్టీ అధికారంలో ఉన్నా న్యాయం కోసం పోరాడాల్సిందేనా అన్నట్టుగా తయారయ్యింది టీడీపీ శ్రేణుల పరిస్థితి. వైసీపీ విపక్షంలో ఉండి కూడా తమ కన్నా పై చేయి సాధిస్తుంది అనే భావన కొంతమంది టీడీపీ క్యాడర్లో బలంగా వినిపిస్తుంది.
ఇందుకు తాజాగా జరిగిన ఓ దుర్ఘటన ఉదాహరణగా చూపుతున్నారు టీడీపీ మద్దతుదారులు. వైసీపీ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై చేసిన నీచమైన వ్యాఖ్యలు, ఆ పై ప్రభుత్వం స్పందించిన తీరు టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యింది.
నాడు వైసీపీ అధినేత వైస్ జగన్ సతీమణి భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను టీడీపీ కార్యకర్త క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన పై ప్రభుత్వం స్పందించిన తీరు, పార్టీ పరంగా సదరు వ్యక్తి పై అధినేత బాబు తీసుకున్న నిర్ణయం, ఆయన పై అధికారులు చూపించిన అత్యుత్సహం ఇవన్నీ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పించిన మాట వాస్తవం.
అయితే సీఎం బాబు మాత్రం మహిళలను అగౌరపరిచే వ్యాఖ్యలు ఏ పార్టీ వారు చేసినా సహించేది లేదంటూ తెగేసి చెపుతూ అందుకు తగ్గట్టే తన కార్యచరణను ప్రకటించారు. అయితే నాడు భారతి కి జరిగిన తక్షణ న్యాయం నేడు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి కి ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది టీడీపీ క్యాడర్ ను వెంటాడుతున్న ప్రశ్న.
ప్రసన్న కుమార్ కనీసం తానూ ఆ మహిళా నేత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అంటూ ఏమాత్రం పచ్చాత్తాపం లేకుండా చెపుతున్నప్పటికీ అధికారులు ఆయన పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు అలసత్వం వహిస్తున్నారు.? భారతి కి ఒక న్యాయం ప్రశాంతి రెడ్డి కి మరో న్యాయమా.?
లేక వైసీపీ మాజీ మంత్రికి ఒక చట్టం, టీడీపీ క్యాడర్ కు మరో చట్టమా.? అంటూ టీడీపీ మద్దతుదారులు అధికారులతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి వీరి ప్రశ్నలకు బదులు చెప్పాల్సిన అవసరం, వారి ధర్మాగ్రహానికి న్యాయం చెయ్యాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు టీడీపీ పార్టీకి కూడా ఉంది.




