6 దేశాలను మట్టికరిపించారు… లైన్ లో ఆస్ట్రేలియా..!

Team India Vs Australia Test Match 2017టెస్ట్ క్రికెట్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 19 టెస్టులుగా ఓటమి ఎరుగకుండా సరికొత్త కెప్టెన్సీ రికార్డును విరాట్ కోహ్లి వశం చేసుకున్నాడు. ఇప్పటివరకు సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న 18 టెస్టుల రికార్డును తిరగరాసిన కోహ్లి, వరుసగా తన కెప్టెన్సీలో 6వ సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో మొదలైన విజయాల పరంపరలో… ఆ తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టీండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్టులు ఉండగా, తాజాగా హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ ను మట్టికరిపించారు.

ADVERTISEMENT

బంగ్లాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో చివరి రోజు విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉండి బరిలోకి దిగగా, టీ విరామం లోపునే మొత్తం వికెట్లను నేలకూల్చి టీమిండియా జయకేతనం ఎగురవేసింది. బంగ్లాదేశ్ చివరి వరుస బ్యాట్స్ మెన్లు పోరాటపటిమను ప్రదర్శించారు గానీ, బంగ్లాను ఓటమి నుండి కాపాడలేకపోయారు. జడేజా అద్బుతమైన బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్లను పెవిలియన్ బాట పట్టించగా, మరో ఎండ్ లో ఇషాంత్ శర్మ కట్టుదిట్టమైన అద్భుతమైన బౌలింగ్ తో 2 వికెట్లు తీసాడు.

చివరి వికెట్ వద్ద నాటకీయ పరిమాణాలు ఏర్పడినప్పటికీ, ‘రివ్యూ’ తీసుకున్న కోహ్లి మ్యాచ్ ను ముగించడంలో విజయవంతం అయ్యారు. దీంతో 208 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అశ్విన్, జడేజాలు చెరో 4 వికెట్లు సొంతం చేసుకోగా, డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వశమైంది. ఇప్పటికీ ఆరు దేశాలను మట్టికరిపించిన టీమిండియా తదుపరి సిరీస్ లో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ సిరీస్ లో కూడా ఇలాంటి ఆధిపత్యాన్నే ప్రదర్శిస్తే… ప్రపంచ క్రికెట్ లో టీమిండియా యుగం ప్రారంభమైనట్లే చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories