చిచ్చుబుడ్డి లా లేచి..తుస్సుమన్నారు..!

Indian Cricketers

పాత రోజుల్లో అయితే ఒక క్రికెట్ ఆటగాడు నేషనల్ జట్టులో చోటు సంపాదించాలంటే ఎన్నో జాతీయ రంగాలలో రాణించి, ఫామ్ కోల్పోకుండా అదే ఆటతీరును కొనసాగిస్తూ, సెలెక్టర్ల దృష్టిలో పడి, వారిని ఇంప్రెస్ చేయాల్సి వచ్చేది. ఇదంతా కూడా ఎన్నో ఏళ్ళ కఠోర శ్రమనే చెప్పాలి. అయినా ఇంత చేసినా జట్టులో చోటు దక్కుతుందా అంటే అది సందేహమే.

కానీ, గత కోనేళ్ళుగా ఐ.పీ.ఎల్ పుణ్యమా అంటూ ఆటగాళ్ల ఎంపిక సులువయింది. ఎందరో క్రీడాకారులకు ఐ.పీ.ఎల్ ఆసరాగా నిలిచింది. ఎంతో మంది జాతీయ జట్టు లో చోటు కూడా అందుకుని టీం ఇండియా జర్సీలను ధరించే అదృష్టాన్ని పొందారు. అయితే ఇందులో చాలా మంది ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే విషయంలో మాత్రం విఫలమవుతున్నారు.

ADVERTISEMENT

అందులో మొదటగా గుర్తుకొచ్చే పేరు ‘ఉమ్రాన్ మాలిక్’. ఈ జమ్మూ కుర్రాడు దేశవాళీ మ్యాచ్లలో అద్భుతంగా రాణించడంతో, ఐ.పీ.ఎల్ ఆక్షన్ లో సన్-రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, మొదట్లో తన పేస్ తో బ్యాట్టర్లను ఇబ్బంది పెట్టాడు. కానీ, లైన్ అండ్ లెన్త్ లేకపోవటం, రా పేస్ బౌలింగ్ కారణంగా బ్యాట్టర్లు ఇతనిని సులువుగా ఎదుర్కొన్నారు, అదే వరుసలో జాతీయ జట్టులో కూడా చోటు కోల్పోయాడు.

రెండవ ప్లేయర్ గా మరలా సన్-రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ‘నటరాజన్’ ను చెప్పుకోవాలి. ఐపీఎల్ 2022 లో తన అద్భుతమైన ప్రదర్శన దృష్ట్యా, జాతీయ జట్టులో సైతం తనకు చోటు వచ్చేలా చేసుకున్నాడు. జట్టుకు ఎంపికయిన తరువాత కూడా, తాను జట్టులో చోటు కోల్పోయే అంత దిగువ స్థాయి ప్రదర్శన చేయనప్పటికీ, అర్షదీప్ వంటి యువ బౌలర్ పోటీ ఇవ్వటంతో తన చోటు కోల్పోయాడు.

ఇక, భారత జట్టు తరపున 300 పరుగులు చేసిన రెండవ ఆటగాడు ‘కరుణ్ నైర్’. అలాంటి ఆటగాడు జట్టు లో కనుమరుగవటానికి ఎంతో సమయం పట్టలేదు. 2016 లో 300 పరుగులు చేసినప్పటికీ, ఆ ఫామ్ కొనసాగించలేక చోటు కోల్పోయాడు. మరో ఆటగాడు ‘విజయ్ శంకర్’ సైతం ఏకంగా వరల్డ్ కప్-2019 జట్టులో భాగమయ్యుండి కూడా, మరల జట్టులో దర్శనమివ్వలేదు. నిజానికి,అదే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా.

మయాంక్ అగర్వాల్, ప్రిథ్వి షా వంటి బ్యాట్టర్లు దేశవాళీ టోర్నీలలో మంచి గుర్తింపు పొంది జట్టు లోకి ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ చేసిన తరువాత కూడా మంచి ఫామ్ ను కొనసాగించినప్పటికీ, ఆ ఓపెనింగ్ స్పాట్ కు ఉన్న విపరీతమైన పోటీ కారణంగా తమ చోటు ను కోల్పోక తప్పలేదు.

ఇలా ఎందరో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అనేకానేక కారణాల చేత జట్టులో తమ స్థానాన్ని ఒడిసి పట్టుకోలేక, చోటును కోల్పోయి టీం ఇండియాలో చిచ్చుబుడ్డి లా లేచి..తుస్సుమన్నారు.

ADVERTISEMENT
Latest Stories