మల్లన్న వచ్చారు మరి కవిత.?

Teenmaar Mallanna Launches TRP, Kavitha Eyes New Party

తెలంగాణ రాజకీయాలలోకి నేడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ద్వారా ఒక కొత్త బీసీ పార్టీ ఆవిర్భవించింది. ‘తెలంగాణ రాజ్యధికార పార్టీ’ పేరుతో తీన్మార్ మల్లన్న బీసీ లకు రాజ్యాధికారం అంటూ ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసారు.

అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా తెలంగాణ రాజకీయాలలో భాగమైన మల్లన్న బీసీ నినాదంతో ఇతర సామజిక వర్గాల మీద పరిధికి మించి విమర్శలు చేస్తూ కుల రాజకీయాలకు నాంది పలికారు. దీనితో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ వేటు వేస్తూ మల్లన్న ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపించింది.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో మల్లన్న అటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీ సామాజికవర్గాలు అనుకూలంగా రాజకీయం ప్రారంభించారు. అందులో భాగంగానే అటు బిఆర్ఎస్ కు దగ్గరగా ఇటు కవిత కు దూరంగా తీన్మార్ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.

అయితే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న అప్పుడే టిఆర్పి పార్టీని స్థాపించి తెలంగాణలో బీసీ రాజకీయాలు షురూ చేసారు. మరి అదే బీసీ నినాదంతో, సామజిక తెలంగాణ సాధన అంటూ తెలంగాణ రాజకీయాలను జాగృతం చేస్తున్న కవిత తన తిరుగుబాటులో బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చారు.

అలాగే బిఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కూడా త్వరలో మరో కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టనున్నారు అంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇక కవిత కూడా ఆ ఉహాగానాలకు బలం చేకూరేలాగానే కొన్ని రాజకీయ ప్రకటనలు చేసారు.

కాంగ్రెస్ ను కాదని కవిత ను విమర్శించి తీన్మార్ కొత్త పార్టీతో ముందుకు రావడంతో ఇక అందరి ద్రుష్టి హరీష్ ను విమర్శించి బిఆర్ఎస్ ను వదులుకుని బయటకొచ్చిన కవిత పైకి మళ్లింది. మరి కేసీఆర్ ను కాదని కేటీఆర్ కు వ్యతిరేకంగా కవిత తెలంగాణ రాజకీయాలలో పట్టు సాధించగలదా.?

అలాగే తీన్మార్ మల్లన్న కూడా అటు అధికార కాంగ్రెస్ కు కాదని, ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా, బీజేపీ కి ఎదురెళ్లి తెలంగాణ రాజకీయాలలో TRP తో మనుగడ సాగించగలరా.?

ADVERTISEMENT
Latest Stories