Teenmar Mallanna- Caste Politics Started in Telangana

ఎవరు ఔనన్నా కాదన్నా కుల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో కలుషితమైనప్పటికీ మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం ఇప్పటివరకు ఈ కుల వైరస్ తాకలేదనే చెప్పాలి. ఉద్యమాల పోరాటలతో, ప్రాంతీయ విభేదాలతో ఇన్నాళ్లు రాజకీయం చేసిన తెలంగాణ కు ఇప్పుడు కొత్తగా ఈ ‘వాక్సిన్ లేని వైరస్’ ను వ్యాపింపచేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

ఒక జర్నలిస్ట్ గా రాజకీయ తెరమీదకు అడుగుపెట్టిన ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా మొదటిసారిగా రాజకీయ పదవిలోకి వచ్చి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నారు అనేలా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ నేతగా రాజకీయ అవకాశం అందిపుచ్చుకున్న మల్లన్న మరో సామజిక వర్గం మీద నిత్యం విషం చిమ్ముతూ తెలంగాణకు కుల రాజకీయాలను పరిచయం చేస్తున్నారు.

Also Read – తండేల్ కాంబోస్..!

హనుమకొండలో జరిగిన ‘బీసీ యుద్ధభేరి’ సభలో పాల్గొన్న మల్లన్న రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ నేతే సీఎం కానున్నారని, అగ్ర కులాల నుంచి చివరి ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండబోతున్నారంటూ వ్యాఖ్యానించి కాంగ్రెస్ నేతలకు, రేవంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అలాగే బీసీ నాయకుల గురించి, బీసీ సామజిక వర్గ ప్రజలను రెచ్చకొట్టేలా మరో సామజిక వర్గాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణకు బీసీలే అధిపతులని, తమ వద్ద రాజకీయాలు చేసినంత డబ్బులేదని కొందరు భావిస్తున్నారని, అయితే తమ వద్ద ఉన్న ఆర్థికబలంతో బిఆర్ఎస్ పార్టీని కూడా కొనగలమనేదే గ్రహించాలంటూ, ఇప్పటికే తెలంగాణలో OC వర్గాల నుంచి 60 మంది ఎమ్మెల్యే లు ఉన్నారని, ఇక పై ఆ సంఖ్యను బీసీ నేతలుగా మార్చాలని లేకుంటే వారితో రాజకీయ యుద్ధం తప్పదంటూ తెలంగాణ రాజకీయ పార్టీలకు ముఖ్యంగా రేవంత్ సర్కార్ కు గట్టి హెచ్చరికలు పంపారు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?


అయితే ,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి తీన్మార్ మల్లన్న మరో కేఏ పాల్ మాదిరి తయారయ్యారని ఆయన వల్ల పార్టీకి జరిగే మంచి కంటే కూడా చెడే ఎక్కువని, ఇప్పటికైనా టి. కాంగ్రెస్ నేతలు మల్లన్నను అదుపు చెయ్యలేకపోతే చివరికి ఈ వాక్సిన్ లేని కుల వైరస్ తో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.