
సూర్యోదయం వేడికి వికసించి, సూర్యాస్తమయం చల్లదనానికి వాడిపోయే కమలం మాదిరి బీజేపీ కూడా బిఆర్ఎస్ నిస్సహాయతో పుంజుకుని, బిఆర్ఎస్ పోరాట స్ఫూర్తి తో వడిలిపోతుంది.
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలచ్చిన తీర్పుతో నైరాశ్యంలోకి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల నుండి అజ్ఞాతంలోకి వెళ్ళింది. దానికి తోడు కవిత లిక్కర్ కేసులో అరెస్టు కావడం, కేటీఆర్ పై ఫోన్ టాపింగ్ ఆరోపణలు రావడం, పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవ్వడంతో బిఆర్ఎస్ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా హస్తం గూటి చేరారు.
Also Read – పాక్‌పై దాడి అనివార్యమే.. ఆమోదం కోసమే కీలక సమావేశం?
సొంత పార్టీ నేతలను కాపాడుకోలేక, వారసుల మీద వస్తున్న ఆరోపణల మీద ఎటూ స్పందించలేక, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ తో, అక్కడ కేంద్ర ప్రభుత్వ బీజేపీతో పోరాడలేక కొన్నాళ్ళు మౌన దీక్షలో ఉన్న బిఆర్ఎస్ నిస్సహాయతతో తెలంగాణలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది.
ఈ పెంచుకున్న బలంతోనే 2019 లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ, 2024 నాటికీ వాటిని రెట్టింపు చేసుకుని 8 కి ఎదిగింది. బిఆర్ఎస్ బలహీనతను బీజేపీ బలంగా మార్చుకుని తెలంగాణలో కమలం వికసించింది. అయితే తన బలహీనత తన ప్రత్యర్థికి బలమవుతుంది అని గ్రహించిన బిఆర్ఎస్ తిరిగి తన పోరాట పటిమను చూపి పార్టీను బలపరుచుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తుంది.
Also Read – వైసీపీ శవ రాజకీయాలకు వేళాయే!
అందులో భాగంగానే కాంగ్రెస్ గూటికి చేరిన బిఆర్ఎస్ నాయకులను తిరిగి బిఆర్ఎస్ కారెక్కించేందుకు కేసీఆర్ తన బుద్ధిబలానికి పని చెపుతున్నారు. అలాగే ఇన్నాళ్ళుగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ మళ్ళీ వార్తలలో నిలుస్తున్నారు.
కేసీఆర్ మౌనంతో, బిఆర్ఎస్ మీమాంసతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆశపడ్డ బీజేపీ నేతలకు కేసీఆర్ తన చర్యలతో నిరాశనే కలిగించారు. దీనితో తెలంగాణలో బీజేపీ కమలం వాడిపోయింది. తెలంగాంలో బిఆర్ఎస్ బలహీనతతో బీజేపీ బలం పెంచుకోవాలని చూసిన కమలానికి ఎదురుదెబ్బే తగలనుంది.