వైఎస్ ఇక లేకపోయినా… ఆయన కొడుకు కాంగ్రెస్ తో విభేదించిన.. వైఎస్ సెంటిమెంటే

Telangana Congress Bus yatrasకాంగ్రెస్ పార్టీని ఒంటి చేతితో అధికారంలోకి తెచ్చిన వైఎస్సాఆర్ ఇక లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి వేరు కుంపటి పెట్టుకున్నారు. అయినా తెలంగాణ లో కాంగ్రెస్ వైఎస్ సెంటిమెంట్ వైపే ఆశలు పెట్టుకున్నట్టు ఉంది.

ADVERTISEMENT

2019లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కాంగ్రెస్ తెలంగాణాలో బస్సు యాత్ర మొదలు పెట్టింది. ఆయన పాదయాత్ర ఆరంభించిన ప్రదేశం నుంచే పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆద్వర్యంలో ప్రజా చైతన్య బస్ యాత్రను ఆరంభించారు.ఈ సందర్భంగా పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించారు.

బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని కాంగ్రెస్ అంటుంది. తెలంగాణ ఇచ్చిన ఆ క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కలేదు. ఏపీని త్యాగం చేసినా అక్కడి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి కి పట్టం కట్టారు. అయితే దక్షిణాదిన కర్ణాటక తరువాత తమకు ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ భావిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories