అద్వాన పాలనకి ఉదాహరణగా ఏపీ?

Nara_Lokesh_TDPత్రిదండి చిన్న జీయర్ స్వామీజీ ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై ప్రయాణం చక్కటి జ్ఞాపకమని వ్యంగ్యంగా అనడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ స్పందిస్తూ వరుస ట్వీట్స్ చేశారు.

“రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్క రాష్ట్ర పాలకులు అద్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పందన శూన్యం. రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా హిందూ ధర్మ ప్రచారమే జీవిత లక్ష్యంగా సాగుతోన్న చిన్న జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు.

ADVERTISEMENT

గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవారం వరకు రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని ప్రవచనంలో మద్యలో భక్తులకు చెప్పడం చూస్తే… జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం అవుతుంది,” అని ట్వీట్ చేస్తూ, జీయర్ స్వామి చెప్పిన ఆ వీడియో క్లిప్‌ని కూడా జత చేశారు.

రాష్ట్రంలో ఓ సమస్య ఉందని ప్రతిపక్షాలో మరొకరో చెపితే వారిపై ఎదురుదాడి చేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోదు పైగా ఆ తప్పును కప్పిపుచ్చుకొంటున్నట్లు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇటువంటి తప్పులు, లోపాలు జరుగలేదా అని ప్రశ్నిస్తూ తమ లోపాలను సమర్ధించుకోవడం ఇంకా పెద్ద తప్పు. అయినా మా పరిపాలన నభూతో నభవిష్యత్ అని వైసీపీ మంత్రులు గొప్పగా చెప్పుకొంటునప్పుడు మూడేళ్ళ గొప్ప పరిపాలన తరువాత కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు ఉంది?అద్వాన పాలనకు ఉదాహరణగా ఏపీని మన పొరుగు రాష్ట్రం చూపిస్తోందనే నారా లోకేష్‌ వ్యాఖ్యలనైనా వైసీపీ నేతలు చెవికెక్కాయో లేదో?

ADVERTISEMENT
Latest Stories