భరత్ ‘విజన్’కు క్లూ!

The vision of bharatమంగళవారం సాయంత్రం విడుదల కాబోతున్న ముఖ్యమంత్రి భరత్ ‘విజన్’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. రెండు డిజాస్టర్స్ తర్వాత ఫ్యాన్స్ కు ప్రామిసింగ్ మూవీగా కనపడుతోన్న ‘భరత్ అనే నేను’ పబ్లిసిటీ విషయంలో అభిమానులు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తామో అని స్పష్టమైన టైం చెప్పడంతో పాటు, చెప్పిన సమయానికి విడుదల చేయడం, చెప్పకుండానే పోస్టర్లను రిలీజ్ చేయడంతో అభిమానులు ప్రొడక్షన్ యూనిట్ పై ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ADVERTISEMENT

ఇక భరత్ ‘విజన్’ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘విజన్’ యొక్క క్లూ ఏమిటో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది. మహేష్ వాడుతున్న ల్యాప్ టాప్ లో చిన్నపిల్లవాడి ఫోటో ఉండడంతో, పిల్లల సంక్షేమం టార్గెట్ గా ఈ టీజర్ ఉండబోతోందని సంకేతాలు ఇచ్చారు. రొటీన్ కలర్ ఫుల్ పోస్టర్స్ స్థానంలో రిలీజ్ చేస్తోన్న ‘యాష్’ కలర్ పోస్టర్స్ సినిమా మూడ్ ను కొనసాగించడంలో సక్సెస్ అవుతున్నాయి. దీంతో పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం స్పష్టం.

ADVERTISEMENT
Latest Stories