ఇండస్ట్రీ ని వెనక్కి లాగకండి స్వామీ !

tollywood directors with routine storiesఒకప్పడు ప్రాంతీయ సినిమాగా మాత్రమే ఉన్న తెలుగు పరిశ్రమని పాన్ ఇండియా సినిమా రేంజ్ కి తీసుకెళ్లాడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం టాలీవుడ్ గురించి చర్చించుకునేలా చేశారు. బాహుబలి ముందు వరకు తెలుగు సినిమాల లెక్క వేరుగా ఉంటే ఆఫ్టర్ బాహుబలి టాలీవుడ్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ ఏర్పడింది. ఈ క్రమంలో బాహుబలి ఇచ్చిన స్పూర్తితో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు మన స్టార్స్.

బాహుబలి నుండి ఈమధ్య రిలీజైన RRR వరకు తెలుగు సినిమా ఖ్యాతి పెంచుతూ వస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు కోలీవుడ్ లో డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తుంటే తెలుగు దర్శకులు మాత్రం రొటీన్ సినిమాలు చేసేవారు. కాని ఎప్పుడైతే మన సినిమాలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాయో అప్పటి నుండి సినిమాల తీరు మారింది. తమిళ, హిందీ పరిశ్రమలు సైతం అవాక్కయ్యే సినిమాలు చేస్తూ వస్తున్నారు.

ADVERTISEMENT

కేవలం బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలే కాదు స్మాల్ బడ్జెట్ తో కూడా వెరైటీ కథలతో శభాష్ అనిపించేస్తున్నారు. కానీ ఇలాంటి టైం లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు మాత్రం తీవ్రంగా నిరాశపరచాయి. చిరంజీవి, రాం చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య పరమ రొటీన్ కథతో రాగా.. లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా కూడా కిచిడి కథతో, అనవసరమయిన డబుల్ మీనింగ్ డయలాగ్స్ తో తెరకెక్కించారు. ఓ పక్క తెలుగు సినిమా స్థాయిని పెంచేలా సినిమాలు చేస్తున్న దర్శకులు వస్తుంటే.. మరోపక్క స్టార్స్ సైతం ఇలా రొటీన్ కథలతో వస్తున్నారు.

రొటీన్ కథలు చేయడం తప్పా అంటే ఎంత మాత్రం కాదు. కానీ మినిమమ్ ఇంటెర్ట్రయిన్మెంట్ ఉంటే, కథ పాతదే అయినా బ్లాక్బస్టర్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

మహేష్ సర్కారు వారి పాట తర్వాత నెక్స్ట్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. అలాంటి హీరో ఇలాంటి అర్ధం పర్థం లేని సెకండ్ హాఫ్ తో అసలు కథేంటో అర్ధం కాకుండా ఉండే సినిమా ఈ టైం లో రావడం చూస్తుంటే టాలీవుడ్ కథ మళ్లీ అడ్డం తిరిగినట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రేక్షకులు ఒకటి మాత్రం అడగగలరు – ఇండస్ట్రీ ని వెనక్కి లాగకండి స్వామీ!

ADVERTISEMENT
Latest Stories