కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఏమాత్రం పని చేస్తుందో తెలీదుగానీ తెరాస మాత్రం ఒకింత ఈ పొత్తుపై సీరియస్ గానే దాడి చేస్తుంది. ఒకప్పుడు బాగా పని చేసిన టార్గెట్ చంద్రబాబు వ్యూహాన్ని మళ్ళీ బయటకు తీసి ఏపీ ముఖ్యమంత్రిని తిట్టిపోస్తుంది. మహాకూటమిని గెలిపిస్తే తెలంగాణ ప్రజలు అమరావతికి ఢిల్లీకి ఊడిగం చెయ్యాలని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.
[m9ad]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎపి నిఘా అధికారులు తెలంగాణలో క్యాంప్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్ నుండి కింద స్థాయి నాయకుల వరకు చంద్రబాబుని తిట్టి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడితే ఎన్నికలలో ఫలితం ఉండవచ్చని భావిస్తున్నట్టుగా ఉంది. లేకపోతే చచ్చిన పాము వంటి టీడీపీనే టార్గెట్ చేసుకుని ప్రచారం చెయ్యడమేంటి?



