సెంచరీకి దగ్గరలో తెరాస?… ప్రతిపక్షాన్ని మొత్తంగా కబళించే వ్యూహం

TRS lobbying with telangana congress mlaఒకప్పుడు తెరాసను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామంటూ బేరం పెట్టిన పార్టీ అది.. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. అసెంబ్లీలో ఇప్పుడా కాంగ్రెస్‌ పార్టీనే విలీనం చేసుకునే దిశగా తెరాస పావులు కదుపుతోంది. ఇప్పటికే కౌన్సిల్ లో కాంగ్రెస్ ను లేకుండా చేసింది తెరాస ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా శాసనసభలోనూ లేకుండా చెయ్యాలని చూస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్ తరపున ఇటీవలే గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కోవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది.

ADVERTISEMENT

[m9ad]

అధికార పార్టీ సంధిస్తున్న ఈ విలీనాస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో పాలుపోక కాంగ్రెస్‌ విలవిల్లాడుతోంది. కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మంది అంటే 13 లేదా 14 మంది ఎమ్మెల్యేలు రావాలి. దీనికి అనుగుణంగా తెరాస పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 మంది సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ మిగిలిన వారిని కూడా లాక్కున్న తరువాతే అసెంబ్లీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

అందుకే ఇప్పటివరకు అసెంబ్లీని సమావేశపర్చలేదు. కేబినెట్ ను కూడా విస్తరించలేదు. తెదేపా తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు కూడా తెరాస వల వేస్తుంది. సండ్ర ఇప్పటికే ఒప్పుకున్నట్టు సమాచారం. ఎన్నికల్లో తెరాసకు 88 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌, వైరా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌లు చేరారు. దీంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య 90కి చేరింది.

కాంగ్రెస్ తరపున ఎనిమిది మంది, టీడీపీ తరపున ఒకరిని వేసుకున్నా 99 కి చేరింది తెరాస. సెంచరీ ముంగిట మరింత మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వల విసురుతుంది. అయితే తెరాస చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజాస్వామ్యానికే మచ్చ అని చెప్పుకోవాలి. అసలు ఎన్నికలు అనేదానికే అర్ధం లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు అధికారంలో తెరాస ఉంది కాబట్టి ఇలా… వచ్చే సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలాంటి ప్రయత్నమే చేస్తుంది. ఇక ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకు విలువ ఏముంది?

ADVERTISEMENT
Latest Stories