Trump's Tariff Shock: Global Impact Explained

డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాల ఎగుమతుల మీద సుంకాలు పెంచుతానని హెచ్చరిస్తూనే ఉన్నారు. అన్నంత పనీ చేశారు. ‘లిబరేషన్ డే’ పేరుతో వివిద దేశాలపై కనిష్టంగా 10 శాతం నుంచి గరిష్టంగా 46 శాతం వరకు దిగుమతులపై సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. యూకే దిగుమతులపై 10 శాతం విధించగా యూరోపియన్ యూనియన్ 20 శాతం, జపాన్ 24 శాతం, భారత్‌ 26 శాతం, స్విట్జర్లాండ్ 31 శాతం, తైవాన్ 32 శాతం, చైనా 34 శాతం, వియత్నాం: 46 శాతం సుంకాలు విధించారు.

Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.

మిత్రదేశాలైన భారత్‌, యూరోపియన్ దేశాలపై కూడా ట్రంప్‌ భారీగా సుంకాలు విధించారు కానీ యుద్ధోన్మాదంతో ప్రపంచంలో అశాంతి సృష్టిస్తున్న రష్యా, ఉత్తర కొరియాలపై ట్రంప్‌ ఎటువంటి అదనపు సుంకాలు విధించలేదు.

ప్రపంచంలో చాలా దేశాలు తమ అమెరికన్ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వసూలు చేస్తూ, అవి మాత్రం తమ ఎగుమతులపై అమెరికాలో నామ మాత్రపు సుంకాలు చెల్లిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, దశాబ్ధాలుగా ఈ దోపిడీ కొనసాగుతున్నా ఏ ప్రభుత్వమూ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని ట్రంప్‌ అన్నారు.

Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?

కనుక ఈ దోపిడీ నుంచి అమెరికాకి విముక్తి కల్పించి న్యాయం చేసేందుకు ఆయా దేశాలపై ఎగుమతి, దిగుమతి సుంకాలు పరిగణనలోకి తీసుకొని ఈ సుంకాలు ఖరారు చేశామని ట్రంప్‌ చెప్పారు.

ప్రపంచ దేశాలన్నీ అమెరికాలో తమ ఉత్పత్తులు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని, కానీ అందుకు తగిన సుంకాలు చెల్లించక తప్పదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

ట్రంప్‌ ‘లిబరేషన్ డే’తో అమెరికాకు విముక్తి కల్పిస్తున్నానని చెప్పుకున్నారు. కానీ ఆయన దెబ్బకు అమెరికాతో ప్రపంచదేశాల మార్కెట్లన్నీ పడిపోయాయి. ముఖ్యంగా అత్యధిక సుంకాలు విధించబడిన దేశాలలో షేర్ మార్కెట్లు భారీగా పడిపోయాయి.




భారత్‌ మార్కెట్లు కూడా ఈ ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 89 పాయింట్లు, సెన్సెక్స్ 322 పాయింట్లు మైనస్‌లో సాగుతోంది. కనుక పవర్, ఇన్‌ఫ్రా, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్లు స్వల్ప నష్టాలలో కొనసాగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టబోతోంది కనుక త్వరలో షేర్ మార్కెట్లు కొలుకునే అవకాశం ఉంది.