
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌పై జైలు నుంచి విడుదలవగానే మొట్టమొదట తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి జగన్ పట్ల తన విధేయతలో ఎటువంటి మార్పులేదని కన్ఫర్మ్ చేసి ఇంటికి చేరుకున్నారు.
Also Read – మిథున్ రెడ్డి: కోటరీ కట్టుబాట్లు పాటిస్తారా.?
ఒకవేళ జగన్ కారణంగానే తనకు ఈ దుస్థితి పట్టిందని భావించి విజయసాయి రెడ్డిలా పార్టీకి రాజీనామా చేసి విమర్శలు గుప్పిస్తే భరించడం చాలా కష్టం.
పోనీ అంబటి లేదా రోజా చేతనో కౌంటర్ వేయిద్దామన్నా ఆయన జగన్ కోసమే, జగన్ వల్లనే జైలుకి వెళ్ళారు. కనుక బెడిసికొడుతుంది. కనుక వల్లభనేని వంశీ తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చి విధేయత ప్రకటించడం తప్పకుండా జగన్‌కి చాలా ఉపశమనం కలిగించేదే.
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
వల్లభనేని వంశీ 140 రోజులు జైల్లో గడిపి వచ్చారు కనుక లుకవుట్ నోటీస్ చేతిలో పట్టుకొని తిరుగుతున్న ఆయన ప్రాణ స్నేహితుడు కొడాలి నాని వచ్చి స్నేహితుడిని పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా వచ్చి వంశీని పరామర్శించారు.
“నా రేషన్ బియ్యం కేసు ఏమైంది? పోలీసులు ఏం పీకుతున్నారు?” అని ప్రశ్నించిన పేర్ని నాని, రెడ్‌బుక్‌లో మొదటి పేజీలో మొదటి వరుసలో ఉన్న కొడాలి నాని, జైలు జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకొన్న వల్లభనేని వంశీ ముగ్గురినీ అలా చూసినప్పుడు వైసీపీ కార్యకర్తలకి త్రిమూర్తులు తమ కళ్ళెదుట ప్రత్యక్షం అయినంతగా సంతోషపడ్డారు.
Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!
ప్రస్తుతానికి వల్లభనేని వంశీ కోటా పూర్తయిపోయింది. కానీ పేర్ని నాని, ముఖ్యంగా కొడాలి నానిల బాకీలు ఇంకా తీరనే లేదు. త్రిమూర్తుల్లా ముగ్గురూ ఎదురుగా కనిపిస్తున్నా పోలీసులు వారిని ఏ వరం కోరలేదు. దేవతలు ప్రత్యక్షమైనప్పుడే వరాలు కోరుకోవాలి. వారు మాయం అయిపోయిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు కదా?