రేవంత్ బాటలో… టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు

vem narender reddy leaving tdp along with revanth reddyతెలంగాణ తెలుగుదేశం పార్టీని రేవంత్ రెడ్డి ఒక్క కుదుపు కుదిపారు. రేవంత్‌రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే వేం నరేందర్‌రెడ్డి కాసేపటి క్రితం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి చారగొండ వెంకటేష్ గౌడ్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు.

ADVERTISEMENT

ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న సతీష్ మాదిగ రాజీనామా చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, టీడీపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి రాజారామ్ యాదవ్ ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నందారం సూర్యానారయణ భార్య అనురాధతో రేవంత్‌ దంపతుల సమాలోచనలు జరిపారు.

అలాగే మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ టీడీపీ ఫ్లోర్‌ లీడర్ కృష్ణమోహన్‌ కొడంగల్‌కు చేరుకుని రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రేపు కాంగ్రెస్ లో జాయిన్ కానున్నట్లు రేవంత్ ప్రకటించనున్నారు. అప్పటికీ ఈ లిస్ట్ ఇంకా పెరగనుంది. తెదేపాకు తెలంగాణాలో మిగిలిన ఒకేఒక్క ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఎటువైపు ఉంటారో చూడాలి!

ADVERTISEMENT
Latest Stories