పరువు లెక్కలు ఇప్పుడెందుకులే అక్కా!

Vidadala Rajini Comments on Marri Rajashekar Reddy Resignation

వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేస్తూ పార్టీలో అవమానాలు భరించలేకనే బయటకు వచ్చానని చెప్పుకున్నారు. కనుక ఆయనకు కౌంటర్ వేసే బాధ్యత చిలకలూరిపేట నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి విడదల రజనీపై పడింది.

ఈరోజు ఆమె చిలకలూరిపేటలో మీడియాసమావేశం ఏర్పాటు చేసి, తండ్రి బాటలోనే పయనిస్తున్న జగన్‌, కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎంత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చారో చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తండ్రి పేరుని నిలబెడుతున్న జగన్‌ గురించి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిదంగా మాట్లాడటం తప్పని విడదల రజనీ తేల్చి చెప్పారు.

జగన్‌ చేతిలో అవమానాలకు గురై బయటకు వచ్చినవారు మర్రి రాజశేఖర్ రెడ్డి తొలి వ్యక్తి అయితే తప్పకుండా ఆయన మాటలను శంకించాల్సి ఉంటుంది.

కానీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, గుండెపోటో గొడ్డలి పోటో తెలియని స్థితిలో మరణించిన బాబాయ్ వివేకానంద రెడ్డి, ఆయనకు న్యాయం చేయాలంటూ గత 5 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సునీతా రెడ్డి, జగన్‌ గొప్పదనం గురించి రోజూ చెపుతూనే ఉన్నారు కదా?

వైఎస్ కుటుంబంతో తరతరాలుగా అనుబందం ఉన్న ఏ-2 విజయసాయి రెడ్డి, ఆనం, మేకపాటి, కోటంరెడ్డి వంటివారు అనేక మంది చెపుతూనే ఉన్నారు కదా?మరి అటువంటప్పుడు మాజీ మంత్రి విడదల రజని జగన్‌ పరువు లెక్కల గురించి మాట్లాడితే జనం నవ్వుకోరా?

నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్‌ ఎంతగా చెలరేగిపోయారో అందరికీ తెలుసు. జగన్‌ ముఖ్యమంత్రి కాకమునుపే ఆక్రమాస్తుల కేసులలో విజయసాయి రెడ్డిని వెంటబెట్టుకొని చంచల్‌గూడా జైలుకి వెళ్ళి వచ్చారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారు. సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్నికలలో గెలవాలనుకున్నారు. వాటి కోసం చేసిన అప్పులు, తాకట్టు పెట్టిన ప్రభుత్వాస్తుల గురించి మీడియాలో కధకధలుగా వస్తూనే ఉన్నాయి.

జగన్‌ ధోరణి, అరాచక పాలన చూస్తున్న వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈయనకు ఎక్కడా పోలికే లేదనుకునే వారు కూడా.

రాజకీయాలలో నిలద్రొక్కుకునేందుకు చనిపోయిన తండ్రి పేరును వాడుకున్న జగన్‌, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా పరువు తీస్తూనే ఉన్నారు కదా? మరి అటువంటప్పుడు ఈ పరువు లెక్కలు ఎందుకక్కా.. ఇంకా పరువు తీసుకోవడానికి కాకపోతే?

ADVERTISEMENT
Latest Stories