ఫ్లాష్ ఫ్లాష్… ‘అదిరింది’ రిలీజ్ ఆగింది!

Mersal Sets Box Office Collections On Fireఅట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన “అదిరింది” సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా, అర్ధాంతరంగా రిలీజ్ ఆగిపోయింది. సెన్సార్ పూర్తయ్యింది, అడ్డంకులన్నీ తొలగిపోయాయని భావించిన నేపధ్యంలో… ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని లేటెస్ట్ గా తెలిసి వచ్చింది. దీంతో విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న “అదిరింది” సినిమా రిలీజ్ ఆగిపోయింది.

ఈ బ్రేక్ కు ప్రత్యేక కారణాలేవీ లేవు. కేవలం రాజకీయ పరమైన ఇబ్బందుల రీత్యా బిజెపి నేతల అక్కసుతోనే రిలీజ్ కు బ్రేక్ పడినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. జీఎస్టీపై హీరో విజయ్ వేసిన డైలాగ్ ల నేపధ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి నేతలు, ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు వేసినట్లుగా సమాచారం. బహుశా వచ్చే వారంలో మళ్ళీ విడుదలకు సన్నాహాలు చేయవచ్చు.

ADVERTISEMENT

గత వారం తమిళంలో విడుదలైన ఈ సినిమాకు భిన్న స్పందనలు వచ్చినప్పటికీ, వివాదం నేపధ్యంలో తలెత్తిన పబ్లిసిటీ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీంతో కోలీవుడ్ లో బంపర్ కలెక్షన్స్ ను ‘మెర్సల్’ సొంతం చేసుకుంది. అదే ఊపులో తెలుగు నాట కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకోవాలన్న విజయ్ కలను బిజెపి నేతలు తాత్కాలికంగా అయితే బ్రేకులు వేయగలిగారు.

ADVERTISEMENT
Latest Stories