విజయసాయిరెడ్డి ప్రధానిని అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటి?

Vijay Sai Reddy secret meeting with narendra modiవైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, జగన్ మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి ఈ మధ్య తరచు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడంపై రకరకాల అనుమానాలు ఉన్నవి. విశేషం ఏంటంటే చంద్రబాబు కంటే ప్రధాని విజయసాయిరెడ్డిని తరచు కలవడం. రెండు పార్టీలు పొత్తులు, కేసుల విషయంలో ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాయి అనే విమర్శ ఉంది.

ADVERTISEMENT

దానికోసమే మిత్రపక్షం టీడీపీని దూరం చేసుకున్నారని విమర్శకుల అభిప్రాయం. ఈక్రమంలో ఈరోజు మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు తీవ్రంగా ప్రయత్నించారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం గంట పాటు నిరీక్షించారు.

కాగా అదే సమయంలో మీడియా ప్రతినిధులు రావడంతో వారిని చూసి విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. అంత రహస్యంగా మీడియాకు తెలియకుండా మోడీని కలవాలని ఎందుకు ప్రయత్నించారో మరి. మరోవైపు విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్‌రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories