ప్రతి ఆరోపణలో అధికార లాలస, వ్యామోహం కనిపిస్తే ఎలా విజయసాయి గారూ?

vijaya sai reddy fires on chnadrababu naiduఏదోరకంగా చంద్రబాబు నాయుడును జైలుకు వెళ్తే తాము జైలుకు వెళ్లిన సంగతి ప్రస్తావించడం మానేస్తారని భావిస్తున్నారు వైకాపా నాయకులు. ఈ క్రమంలో చంద్రబాబును జైలుకు పంపడానికి తహతహలాడుతున్నారు. అమరావతిలో హై కోర్టు భవనాలు డిసెంబర్ నెలాఖరు కల్లా నిర్మాణం పూర్తి అవుతాయని హైకోర్టు విభజనపై తప్పుడు సమాచారం ఇచ్చిన చంద్రబాబుపై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు.

[m9ad]

ADVERTISEMENT

అసత్య ప్రమాణం, కోర్టు ధిక్కరణ నేరాల కింద సుమోటోగా కేసు చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆరు మాసాలు జైలు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు విజయసాయి రెడ్డి. వైఎస్‌ జగన్ కోసమే హైకోర్టును విభజించారని చెప్పడంతో చంద్రబాబుకు మతిభ్రమించిందని అనడానికి నిదర్శనమన్నారు. ఆయనను మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి ఆయన మానసిక పరిస్థితిని పరీక్షింప చేసి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడిగా డిక్లేర్ చెయ్యాలని ఆయన కోర్టును డిమాండ్ చేశారు.

విశేషం ఏమిటంటే వైకాపా వారి ప్రతి మాటలో ప్రత్యేకించి జగన్, విజయసాయి రెడ్డి వంటి వారి ప్రతి మాటలో ఏదో రకంగా చంద్రబాబు కూడా జైలుకు వెళ్తే తమను నిందించారనే తాపత్రయమే కనపడుతూ ఉంటుంది. మరోవైపు చంద్రబాబును ఏదో విధంగా ముఖ్యమంత్రి పీఠానికి అనర్హుడిగా చెయ్యాలని చేస్తే తరువాతి అవకాశం తమకు వస్తుంది అనే ఆరాటమే. అయితే ఈ ఆరాటం ఒక్కోసారి వారి అధికార లాలస, వ్యామోహం కింద అనిపించి వారికే చేటు చేస్తుంది. ఇది వారు గ్రహిస్తే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories