ఓటుకు నోటు పేరుతో చంద్రబాబుని బెదిరిస్తున్నారా విజయసాయిరెడ్డి?

Vijaya sai Reddyరాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కొందరు భాగస్వాములు అవుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి ఐఎఎస్ అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. అయితే దానికి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, వారు కోరుకుంటే వాటిని విడుదల చేస్తానని ఆయన అన్నారు.

ADVERTISEMENT

నిజంగా ఆధారాలు ఉంటే దానికి అధికారుల పర్మిషన్ ఎందుకు? రాజ్యసభ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఇంకో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ ఆకట్టుకోగల్గుతే వైకాపాకు వచ్చే ఒక్క సీటు కూడా రాకుండా పోతుంది. కాబట్టి విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ కు తెరలేపినట్టుగా కనిపిస్తుంది.

తమ వద్ద బేర సారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని బెదిరిస్తే ఓటుకు నోటు కేసులాగా ఎక్కడ మళ్ళి ఇరుకుంటామా అనే భయం చంద్రబాబులో కలిగించాలని విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారా? నిజంగా ఆధారాలు ఉంటే ఎప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామా అని చూసే సాక్షి, వైకాపా వాటిని విడుదల చెయ్యకుండా ఉంటాయా?

ADVERTISEMENT
Latest Stories