Vijayasai-Reddyఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉత్తరాంద్రాను ఏలిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తర్వాత క్రమంగా పార్టీకి, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఢిల్లీలో కాలక్షేపం చేశారు.

రాష్ట్రంలో వైసీపీ తిరుగులేని భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినందున ఈ నాలుగేళ్ళలో మరింత బలపడి తిరుగులేని రాజకీయశక్తిగా మారుతుందనుకొంటే, స్వయంకృత తప్పిదాల వలన కొంత, అంతర్గత కుమ్ములాటల వలన మరికొంత నానాటికీ బలహీనపడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుంటే, పార్టీ పరిస్థితి ఈవిదంగా ఉండటంతో సిఎం జగన్‌ మళ్ళీ విజయసాయిరెడ్డిని బరిలోకి తీసుకురాక తప్పడం లేదు.

Also Read – గౌతమ్ కు బెదిరింపులు…

ఒంగోలులో అలకపాన్పు ఎక్కిన బాలినేని శ్రీనివాసుల రెడ్డికి, విజయసాయి రెడ్డికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. నేడు వారిద్దరితో సిఎం జగన్మోహన్ రెడ్డి ముఖాముఖీ మాట్లాడబోతున్నారు.

చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలలో వైసీపీ పరిస్థితిని చూస్తున్న బాలినేని, జిల్లాల ఇన్‌ఛార్జ్‌ పదవి నాకొద్దంటూ ఇటీవల అస్త్రసన్యాసం చేసిన సంగతి తెలిసిందే. కనుక ఆయనకు మరోసారి నచ్చజెప్పి అంగీకరించకపోతే ఆ మూడు జిల్లాల బాధ్యతను విజయసాయి రెడ్డికి అప్పగించాలని సిఎం జగన్‌ నిర్ణయించిన్నట్లు తెలిసింది.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..

బహుశః అందుకేనేమో ఇంతకాలం సోషల్ మీడియాలో టిడిపి ప్రస్తావనే చేయని విజయసాయి రెడ్డి మళ్ళీ నేడు టిడిపిని ఉద్దేశ్యించి, “పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే సుప్రీంకోర్టు దాకా వెళ్లి గుక్కపట్టి ఏడ్చారు…అలాంటి వారు పేదలను కోటీశ్వరులు చేస్తామంటున్న చిత్తశుద్ధిలేని హామీల “మాయాఫెస్టో”ను నమ్మేదెవరు!” అంటూ తొలి బాణం వేశారు.

ఒకవేళ నేడు జగనన్న సమక్షంలో పదవుల ధారాదత్తం కార్యక్రమంలో విజయసాయి రెడ్డి చేతికి ఆ మూడు జిల్లాలు అందితే మళ్ళీ పూర్తి ఫామ్‌లోకి వచ్చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పర్యటనలు, నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తర్వాత ఆ మూడు జిల్లాలలో టిడిపి మళ్ళీ బలం పుంజుకొంది.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

ముఖ్యంగా సిఎం జగన్‌ కంచుకోట కడప జిల్లాలో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు నీరాజనాలు పడుతున్నారు. కనుక మళ్ళీ వారిని వెనక్కు తెచ్చుకొనే ప్రయత్నంలో టిడిపి మీద ఎదురుదాడి చేయక తప్పదు. కనుక టిడిపి కూడా అందుకు సిద్దపడాల్సి ఉంటుంది.