ఏపీలో టిడిపి, జనసేనలు చేస్తున్న పోరాటాలతో అధికార వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల గురించి నిలదీస్తుంటే మరో పక్క నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల భూకబ్జాల గురించి నిలదీస్తున్నారు.
టిడిపి, జనసేనలకు జవాబులు చెప్పుకోలేక వైసీపీ నేతలు ముప్పతిప్పలు పడుతున్నప్పుడు మరో శత్రువు అవసరమా? అంటే కాదనే అర్దమవుతుంది. కానీ వైసీపీ నేతలు అవసరమే అంటున్నారు. అదే ఏపీ బిజెపి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో అటల్ బిహారీ పార్క్ పేరును తొలగించి దానికి వైఎస్సార్ పార్కు అని బోర్డు తగిలించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఊహించిన్నట్లే రాష్ట్ర బిజెపి తరపున విష్ణువర్ధన్ రెడ్డి ఈ పేరు మార్పుపై ఘాటుగా స్పందించారు. “మహానుభావుల్ని అవమానించడం మానసిక రోగం, వాజ్‌పేయి గార్ని అవమానిస్తే దానివల్ల ఓక ఓటు కూడా పెరగదు బీజేపి మాజీ నేత మాజీ మంత్రి @VelampalliSR గారు . అన్నింటికీ పేర్లు పెట్టుకోవడం అభిమానించడం కాదు అవమానించడం. ఎందుకీ పేర్ల పిచ్చి అని
@YSRCParty అని ప్రశ్నిస్తున్నాం, బోర్డులు మీద కాదు ప్రజల ప్రజల హృదయాల్లో పేర్లు ఉండాలి. తక్షణం తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నాం! సూచన : గతంలో మీ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నా సోదరా వెల్లంపల్లి గారు,” అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కనుక అది పేర్లు మార్చేయగలదు… దేనికైనా వైసీపీ రంగులు వేసుకోగలదు. వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటుచేసుకోగలదు. కానీ రేపు ప్రభుత్వం మారితే అప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చే వీటన్నిటినీ తీసి పక్కన పడేయదా?అది వైసీపీకి, వైఎస్సార్‌కు అవమానకరం కాదా? అది అవమానకరమైనప్పుడు పార్కుకు అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుని తొలగించి అవమానించడాన్ని వైసీపీ నేతలు ఏవిదంగా సమర్ధించుకొంటారు?



