విజయవాడ నగరంలో ట్రాఫిక్ కు కేంద్ర బిందువుగా మారిన బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కు మోక్షం లభించనుంది. దాదాపుగా ఏడాదిన్నర్ర క్రితం ఫౌండేషన్ రాయి వేసిన చంద్రబాబు సర్కార్, ఇప్పటివరకు దానికి సంబంధించిన పనులు ప్రారంభించక పోవడంతో, అసలు ఈ ఫ్లై ఓవర్ కార్యరూపం సిద్ధిస్తుందో లేదోనన్న అనుమానాలు నగర వాసుల్లో నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ఫ్లై ఓవర్ కు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పడంతో, నిర్మాణ పనుల్లో కీలక అడుగు పడినట్లయ్యింది.
ఈ డిజైన్లకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. చైనా రూపకర్తలు రూపొందించిన ఈ డిజైన్ అద్భుతంగా ఉందని చెప్పాలి. నేరుగా హైవేలో ప్రయాణించే విధంగా పైన ఫ్లై ఓవర్, సిటీలో తిరిగే విధంగా క్రింద రహదారులను, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా ఈ డిజైన్లను రూపొందించారు. వీక్షకుల మెప్పు పొందుతున్న ఈ ఫ్లై ఓవర్ కల సాకారం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంత ఉందో ఎంపీ నాని కృషి కూడా అంతే ఉందని చెప్పాలి.
ఇప్పటివరకు జరిగిన జాప్యం కూడా ఫ్లై ఓవర్ మరింత ఉత్తమంగా రావాలని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించాలని నాని తీవ్రంగా కృషి చేసారు. తొలుత చాలా తక్కువ దూరానికే ఈ ఫ్లై ఓవర్ కే కేంద్రం అనుమతి ఇవ్వగా, అలా అయితే ట్రాఫిక్ కష్టాలు తీరవని, దానిని రామవరప్పాడు రింగ్ వరకు పెంచాలని నాని తీవ్రంగా ప్రయత్నించగా, రమేష్ హాస్పిటల్ సెంటర్ వరకు మాత్రమే ప్రస్తుతం అనుమతి లభించింది. అయితే కనీసం రమేష్ హాస్పిటల్ రింగ్ వరకు ఈ ఫ్లై ఓవర్ ను తీసుకువెళ్ళడంలో నాని కృషే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.



