విజయవాడలో టిడిపి కార్యక్రమాలు… నిరసనలు

Gadde-rammohan-distributes-iron-boxesగృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.50 పెంచడంపై టిడిపి మహిళా కమిటీలు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నాయి. పాయకాపురంలో టిడిపి మహిళా కమిటీ సభ్యులు దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గ, సరోజ, లక్ష్మీ, రమణమ్మ, లీల, తులసమ్మ, సావిత్రి, దుర్గ తదితరులు బుదవారం పార్టీ కార్యాలయం ఎదుట వంట గ్యాస్ సిలిండర్లను వరుసగా పెట్టి పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో రూ.350 ఉన్న సిలెండర్ ధర ఇప్పుడు రూ.1,150కి పెరిగిపోయిందని, దానితో పాటు వంటనూనెలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయని వారు ఆందోళన చేశారు. కనుక తక్షణం ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ADVERTISEMENT

విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని అశోక్ నగర్‌లో బుదవారం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేద రజకులకు రూ.49 వేలు ఖరీదు చేసే ఏడు ఇస్త్రీ పెట్టెలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం ఆసరా పధకం కింద ఒక్కొక్కరికీ పదివేలు ఇస్తోందని చెప్పుకొంటోంది. కానీ ఆ పధకం వైసీపీ కార్యకర్తలకే పరిమితమైనట్లుంది. ఓ 20 శాతం మందికి మాత్రమే ఆ పధకం అందుతోంది. మిగిలినవారు దాని కోసం కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్పితే వారికి అందడం లేదు. కానీ ఈ పధకం గురించి జగన్ ప్రభుత్వం కోట్లు రూపాయలతో సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చుకొంటోంది. పైగా ఆ పత్రికలో పనిచేసేవారిని సలహాదారులుగా నియమించుకొని మళ్ళీ వారికి లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోంది,” అని ఆరోపించారు.

ADVERTISEMENT
Latest Stories