అధికార – విపక్షాల మధ్య విమర్శ – ప్రతివిమర్శ సర్వసాధారణమే. అయితే ఒకప్పుడు ప్రతిపక్షాల విమర్శలు ప్రభుత్వానికి సూచన మాదిరి అధికార పక్షాల ప్రతి స్పందన ప్రతిపక్షాలకు సమాధానం మాదిరి ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ విమర్శల శైలి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.
ప్రత్యర్థుల విమర్శలకు కొందరి వైసీపీ నేతలకు బూతులే ఆయుధాలుగా మారిపోయాయి. మరికొందరి నేతలకు సామాజికి మాధ్యమాలు ఆసరాగా మిగిలాయి. ఇందులో వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ముద్దుగా పిలుచుకునే కసాయి రెడ్డి అని పిలవబడే విజయ సాయి రెడ్డి ప్రదములు. ఈయనగారి పాండిత్య ప్రతిభ అంత X మాధ్యమంలోనే బయటపడుతుంది.
ప్రత్యర్థులను విమర్శించడానికి అర్ధం పర్థం లేని ప్రాసలతో, తానూ సమాజం గుర్తించని మేధావిని అని చెప్పుకోవడానికో తెగ ప్రయత్నిస్తుంటారు ఈ A2 విజయసాయి గారు. “గుమ్మడికాయి దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు” ఎవరు ఢిల్లీకి వెళ్లినా అదే పనా అన్నట్లు సాయిగారు అక్కడికే వచ్చి ఆగుతారు. బీజేపీ ఏపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలుగా ఢిల్లీకి వెళ్లిన పురందరేశ్వరిని ఉద్దేశిస్తూ సాయి రెడ్డి X మాధ్యమంలో స్పందించారు.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసమో, మీ పార్టీ అభివృద్ధి కోసమో కాకుండా మీబావ చంద్రబాబు కేసుల కోసం ఢిల్లీలో మీ ప్రయాసలేమిటి చెల్లమ్మా? అంటూ పోస్ట్ పెట్టిన సాయిరెడ్డికి గిల్లి గిల్లిచ్చుకున్నట్టు కౌంటర్లు మొదలయ్యాయి. మరి ఎవరి కేసుల కోసం జగన్ రెడ్డి ఢిల్లీ ప్రయాసలు? మీ ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? మీ పార్టీకి దక్కింది ఏమిటి? దీనికి కూడా బదులిస్తే బాగుంటుంది తమ్ముడు అంటూ నెటీజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలో ఎవరి పాద పూజలు చేస్తే మీరు, మీ అధినేత పదేళ్లనుండి బెయిలు మీద తిరుగుతున్నారు? ఎవరి ఆశీస్సులు దక్కడం వలన మీ ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు విచారణకు డుమ్మాలు కొడుతున్నారు?ఎవరి వ్యయప్రయాసలతో చంద్రబాబుని అరెస్టు చేశారు? వీటికి కూడా ఏదోఒక సమాధానం పోస్ట్ చెయ్యొచ్చుకదా?తమ్ముడు అంటూ సాయిరెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు.
రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా…,రాష్ట్రం వీడి ఎవరు ఎక్కడికి వెళ్లినా అది చంద్రబాబు వల్లనే, చంద్రబాబు కోసమే అనే భ్రమలో నుంచి వైసీపీ నేతలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారని సదరు పోస్టులను చూస్తేనే అర్ధమవుతుంది.వైసీపీ నేతల మానసిక అనారోగ్యానికి చంద్రబాబు విడుదలే సరైన మందేమో అన్న సందేహాలు లేకపోలేదు. లేకపోతే చివరకి మోడీ – షాలు ఆంధ్రాకు వచ్చినా., వాళ్ళు తిరిగి ఢిల్లీకి వెళ్లినా అది కూడా చంద్రబాబు కోసమే అనేటట్టు ఉన్నారు సదరు వైసీపీ సాయిరెడ్డి తమ్ముడు.



