చిలుక పలుకులు నిజమయ్యేనా..?

virat-kohli-rohit-sharma

‘విరాట్ కోహ్లీ’ మరియు ‘రోహిత్ శర్మ’, మన దేశం లోనే కాదు ప్రపంచానికి సైతం ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరంలేదు. ఈ ఇరువురిపై ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఏదోక రూమర్ నడుస్తూనే ఉంటుంది.

కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ న్యూస్ ఏకంగా ఫాన్స్ ను కుదిపేస్తోంది అంటే, అర్ధం చేసుకోవచ్చు అది ఎంత తీవ్రమైనదో అని..!

ADVERTISEMENT

గతేడాది ముగిసిన టి-20 వరల్డ్ కప్ ను అందుకోగానే ఈ ఇద్దరు పొట్టి ఫార్మటు కు గుడ్-బాయ్ చెప్పేసారు. ఇక, ఎవ్వరు ఊహించని విధంగా ఈ సీనియర్ జోడి మే నెలలో టెస్ట్ ఫార్మటు కు సైతం వీడ్కోలు పలికారు.

ఈ ఇద్దరు తమ నిర్ణయాన్ని వెల్లడించే వారం-10 రోజుల ముందు నుండే ఆ రూమర్స్ గట్టిగా వైరల్ అవ్వడం చూసాము. రూమర్స్ ఎంత వైరల్ అయినా, విరాట్ తన ఫెవరెట్ ఫార్మటు కు ఇంత త్వరగా గుడ్-బాయ్ చెప్తాడని ఎవ్వరు ఊహించలేదు.

కొంతమంది కోహ్లీ అభిమనులు ఈ నిజాన్ని ఇప్పటికి కూడా అంగీకరించలేకున్నారు. ఇటు పక్క రోహిత్ సైతం, రిటైర్మెంట్ ప్రకటించే వారం ముందు నుండే వార్తలు వచ్చినప్పటికి, ఫాన్స్ దానిని లైట్ తీసుకున్నారు. కానీ, కొద్దీ రోజుల్లోనే విషయం బయటకు వచ్చింది.

అయితే, మళ్ళీ ఫాన్స్ ను కలవరపెడుతుంది ఇదే అంశం. ఈ ఇద్దరు సీనియర్లు కూడా, 2027 వరల్డ్-కప్ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న సమయంలో, ఈ ఇరువురు వన్-డే లకు కూడా వీడ్కోలు చెప్పనున్నారు అనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఒకటి-రెండు సిరీస్ ల లో అవకాశమిచ్చి, ఇక జట్టు వీరిని దూరం పెట్టనుంది అంటూ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇక, టెస్ట్ రిటైర్మెంట్ అనంతరం భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ నిర్వహించిన ఒక పార్టీ వేదికగా “వారానికి రెండు సార్లు గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తుంది, అందుకే టెస్ట్ ల కు గుడ్-బాయ్ చెప్పేసాను” అన్నాడు విరాట్.

ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో లో విరాట్ తన తెల్ల గడ్డం తో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో అభిమానుల గుండెలో రాయి పడ్డట్లు చేసింది. చూడాలి మరి, సమయం ఈసారి ఎం చేస్తుందో..?

ADVERTISEMENT
Latest Stories