విశాఖ మేయర్ సీటు వైసీపీ చేజారిపోబోతోందా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ, జనసేన, వైసీపీ కార్పొరేటర్లు కూడా. వైసీపీకి చెందిన గొలగాని హరివెంకట కుమారి విశాఖ మేయర్‌గా ఉన్నారు.
స్థానిక టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు శనివారం జిల్లా కలెక్టర్‌ని కలిసి మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేసి, దీని కోసం సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.
విశాఖ నగరంలో మొత్తం 98 కార్పొరేటర్లు ఉండగా వారిలో వంశీ కృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రస్తుతం 97 మందే ఉన్నారు.
వారిలో టీడీపీ 29, జనసేన 3, బీజేపికి ఒకరున్నారు. ఇటీవల 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోగా, మరో ఏడుగురు జనసేనలో, ఒకరు బీజేపిలో చేరారు. దీంతో వైజాగ్ కార్పొరేషన్‌లో టీడీపీ 40, జనసేన 10, బీజేపికి ఇద్దరూ కలిపి కూటమికి 52 మంది అయ్యారు.
వీరుకాక విశాఖపట్నం, అనకాపల్లిలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్ల బలం కూడా కలుపుకుంటే కూటమి బలం 73కి పెరుగుతుంది. మరో ఇద్దరు కార్పొరేటర్లు కూటమికి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో 97 స్థానాలలో కూటమికి 75 స్థానాలున్నాయి.
కనుక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానికి ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. అంటే విశాఖ మేయర్ పదవి కూడా వైసీపీ చేజారీ పోబోతోందన్న మాట!
మేయర్ దిగిపోతే మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరినా ఆశ్చర్యం లేదు. అంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ దుకాణం త్వరలో బంద్ కాబోతుందన్న మాట!




