తెలుగు VS తమిళ్…అన్ని పార్టీలు చిక్కుకున్నాయే..

VP election turns Tamil vs Telugu political battle

ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకి చెందిన సీపీ రాధా కృష్ణన్ ఎన్నికతో బీజేపీ (ఎన్డీయే) పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది అనుకుంటే అటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(ఇండియా కూటమి) కూడా అంతే ధీటుగా తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ని ప్రతిపాదించింది.

దీనితో ఉపరాష్ట్రపతిగా తమిళనాడు అభ్యర్థిని నియమించడం ద్వారా అటు తమిళనాట కూడా బీజేపీ కి అనుకూలంగా ఓటింగ్ జరుగుతుంది అని ఆశించిన బీజేపీ పెద్దలకు ఇప్పుడు తెలుగు వాడైనా సుదర్శన్ ను ప్రకటించడంతో ఇటు కాంగ్రెస్ తెలుగు రాజకీయ పార్టీలను ఆలోచన లో పడేసేలా చేసి బీజేపీ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.

ADVERTISEMENT

రాబోయే తమిళనాడు ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే రాజకీయ ప్రణాళికలు వేస్తూ ఆపరేషన్ తమిళనాడు ను ఉపరాష్టప్రతి ఎంపిక తో మొదలుపెట్టింది అనుకుంటే కాంగ్రెస్ కూడా బీజేపీ ఊహలకు మించి వినూత్నంగా తెలంగాణకు చెందిన తెలుగు వాడిని తెరమీదకు తెచ్చింది.

దీనితో అటు తెలంగాణలో ఈసారి బీజేపీ జెండా ఎగరెయ్యాలి అనుకున్న బీజేపీ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒక తెలంగాణ వ్యక్తిని ఉప రాష్టప్రతిగా నియమిస్తే మీరు తమిళనాడు కు చెందిన వ్యక్తిని ఎన్నుకున్నారు అంటూ అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ టి. బీజేపీ ని ఇరుకున పెట్టే ప్రమాదం లేకపోలేదు.

అలాగే అటు తమిళనాట కూడా స్టాలిన్ పార్టీ ది ఇంచు మించు ఇదే పరిస్థితి. బీజేపీ కి ప్రత్యర్థిగా ఉండే డీఎంకే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి, తమిళ వాస్తవ్యుడైన సీపీ రాధా కృష్ణన్ ను బలపరచాలా.? లేక తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ బలపరిచిన తెలంగాణ అభ్యర్థికి ఓటు వెయ్యాలా.? అన్న సందిగ్ధత పరిస్థితిని ఎదుర్కొటుంది.

ఇక ఏపీ విషయానికొస్తే ఎన్డీయే లో భాగమైన టీడీపీ కి కూడా ఇది ఊహించని చిక్కుముడి అనే చెప్పొచ్చు. తెలుగు వారి ప్రగతికి, అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు కట్టుబడి ఉండే టీడీపీ, వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించే బాబు ఇటు తెలుగు వాడైనా కాంగ్రెస్ కూటమి అభ్యర్థి విషయంలో వెనకడుగు వేయక తప్పని పరిస్థితి.

ఇక ఎన్డీయేలో భాగం కానీ వైసీపీ కూడా బీజేపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపడం, జగన్ తెలుగువాడిని కాదని తమినాడుకు చెందిన వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా మద్దతు పలకడం వైసీపీ కూడా టీడీపీ పై నోరెత్తలేని పరిస్థితిలో చిక్కుకుంది.

ఇక ఈ ఎన్డీయే, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి రాజకీయ క్రీడలో అందరి కంటే సేఫ్ జోన్ లో ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి ఎలాగూ కాంగ్రెస్ అభ్యర్థి పక్షానే నిలుస్తారు కాబట్టి ఇక ఇప్పటి వరకు ఎటు నిర్ణయం ప్రకటించని బిఆర్ఎస్ ఇప్పుడు తప్పక తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన సమయం వచ్చింది.

తెలంగాణ అనే నినాదం మీద రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి కి మద్దతు తెలపక తప్పని పరిస్థితి, మరి బీజేపీ ని కాదని బిఆర్ఎస్ కాంగ్రెస్ వైపు వెళుతుందా.? వెళితే బిఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి పొత్తు అంటూ ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎదిరించగలుగుతుందా.?

ఎన్డీయే – ఇండియా కూటమి ఆడే ఈ ఉప రాష్టప్రతి ఎన్నికల చదరంగం తెలుగు VS తమిళ్ గా సాగుతున్న ఈ తరుణంలో ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన, బిఆర్ఎస్, టి. బీజేపీ…అటు తమిళ రాజకీయ పార్టీలు డీఎంకే, అన్న డీఎంకే అన్ని చిక్కుకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories