నాడు తాచుపాముల ఎగిరిపడ్డారు…నేడు జరిగొడ్డులా దాక్కుంటున్నారు అనే వ్యాఖ్య వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి సరిగ్గా సరిపోతుందేమో అంటున్నారు టీడీపీ శ్రేణులు. గత ఐదేళ్లు చేతిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అధినాయకత్వం మీద నోటికి అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోయిన కొడాలి నేడు అడ్రెస్ లేకుండా పారిపోతున్నారు.
వైసీపీ ఓటమితో సాధారణ టీడీపీ కార్యకర్త నుంచి సామాన్య ప్రజానీకం వరకు అందరి ద్రుష్టి కొడాలి నాని వైపే తిరిగింది. గత ఐదేళ్ల పాపానికి రాబోయే ఐదేళ్లు కొడాలి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్న ఉత్సుకత అందరిలో కనిపించింది.
అలాగే లోకేష్ ప్రచారం చేస్తున్న రెడ్ బుక్ మొదటి బాధితుడు కొడాలి నాని నే అయిఉంటారనే ఊహాగానాలు కూడా గట్టిగా నడిచింది. కానీ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ కొడాలి నాని ప్రభుత్వానికి చిక్కలేదు, రెడ్ బుక్ కి దొరకలేదు.
వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి, వర్నరవీంద్రా, బోరుగడ్డ, పిన్నెల్లి, నందిగామ సురేష్ ఇలా అనేకమంది వైసీపీ నేతలు, మద్దతుదారులు కూటమి వలలో చిక్కినప్పటికీ కొడాలి మాత్రం గుండె పోటుతో తప్పించుకోగలిగారు. నాడు తాచుపాములా టీడీపీ పై బుసలు కొట్టిన కొడాలి నేడు జరిగొడ్డులా దాక్కుంటున్నారు.
గత ఐదేళ్లు చంద్రబాబు, లోకేష్ పై బూతుల రెచ్చిపోయిన ఈ పెద్ద మనిషి నేడు తన మౌనంతో వైసీపీ నేతలకు ఊహించని షాక్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా కొడాలి నాని విషయంలో ఇప్పుడే తొందర పడే ఆలోచనలో లేనట్టు కనిపిస్తుంది. అయితే కొడాలిలో వచ్చిన ఈ మార్పు శాశ్వతమా.? తాత్కాలికమా.? అనేది మాత్రం ఇప్పుడే చెప్పేపరిస్థితి లేదు.
గుండె ఆపరేషన్ కారణంగా కొడాలి విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా.? సాధారణ ప్రజానీకంలో, గుడివాడ నియోజకవర్గంలో కొడాలి పట్ల ఎటువంటి సానుభూతి పవనాలు లేకుండా చూసిన తరువాతనే కూటమి కొడాలి విషయంలో ముందడుగు వేయనుందా.? అప్పటి వరకు ప్రభుత్వానికి కొడాలికి మధ్య దొంగ పోలీస్ ఆట కొనసాగుతూనే ఉంటుందా.?




