వైసీపీ రాకపోతే…నాణానికి రెండో కోణం..

What If YSRCP Returns to Power in Andhra Pradesh?

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, రాజధాని అమరావతి భవితవ్యం ఎలా ఉంటుందో ఇప్పటికే అందరు ఒక అంచనాకు వచ్చే ఉంటారు.

2029 లో వైసీపీ 2.0 రప్ప రప్ప నరుకుడే అంటూ పోస్టర్లు వెలుస్తున్నాయి. అలాగే జగన్ 2.0 కక్ష్య రాజకీయాల కోసం, కార్యకర్తల అవసరాల కోసం అంటూ జగన్ ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT

అంటే దీని బట్టి చూస్తే వైసీపీ కి అధికారం కావాల్సింది రాష్ట్ర బాగు కోసం కాదు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసము కాదు. కేవలం ప్రత్యర్థి పార్టీ నాయకుల రాజకీయ పతనం కోసం, తన పార్టీ నేతల పదవుల కోసం అనేది స్పష్టమైపోయింది.

అయితే నేడు మీడియా ముందుకొచ్చిన అంబటి రాంబాబు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజధాని పై వైసీపీ స్టాండ్ ఏంటి అంటూ ప్రశ్నించగా అందుకు మాజీ మంత్రి మీ ప్రశ్నలోనే వైసీపీ వస్తే అని ఉంది అంటే వైసీపీ వస్తుందనేగా అంటూ రాజధాని అంశాన్ని తప్పించి వచ్చేది వైసీపీనే అంటూ బదులిచ్చారు.

అయితే వైసీపీ వస్తే ఏపీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉన్నవారికి వైసీపీ రాకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి అన్న విషయాన్నీ కూడా అంచనా వెయ్యగలిగితే ఏపీ భవిష్యత్ కి వైసీపీ అవసరమా లేదా అన్నది తేలిపోతుంది.

వైసీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే రాజధానిగా అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అలాగే విశాఖ ఐటీ హబ్ గా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. దానికి తోడు వైసీపీ ఉన్మాదం కూడా అంచలంచలుగా పాతాళానికి పడుతుంది.

పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై పూర్వపు నమ్మకం, భరోసా కలుగుతుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరుగుతుంది. రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది. అలాగే ఏపీ అన్ని రంగాలలోను పొరుగు రాష్ట్రాలతో పాటు ధీటుగా పోటీ పడగలుగుతుంది.

క్లుప్తంగా చెప్పాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి వైసీపీ పార్టీకి ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే భవిష్యత్ ఉంటుంది. అలాకాకుండా వైసీపీ అధికారంలోకి రాకుంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్ర భవిష్యత్ మాత్రం అభివృద్ధితో కళకళలాడుతుంది.

ADVERTISEMENT
Latest Stories