
వైసీపీ అనే పెను బూతంలో చిక్కుకుని తమ రాజకీయ జీవితాలను శిధిలం చేసుకున్న జగన్ సొంత వర్గం ఒక్కొక్కరుగా తమ మనోగతాన్ని బహిర్గతం చేస్తున్నారు. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆ పార్టీ అధినేత వైస్ జగన్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు.
అయితే జగన్ మాటలకు అంత విలువ ఉందా.? ఆయన హామీలకు అంతటి విశ్వసనీయత ఉంటుందా అంటే ఒక్కసారి వైసీపీ గత చరిత్రను, వర్తమాన పరిస్థితిని పరిశీలిస్తే యిట్టె అర్ధమవుతుంది. గతంలో జగన్ తన అక్రమాస్తుల కేసు విషయమై సుమారు 16 నెలలు జైలు జీవితం అనుభవించారు. అయితే ఆ సమయంలో వైసీపీ భుజం కాసి, ఆ పార్టీని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లారు ఆయన సోదరి వైస్ షర్మిల.
Also Read – జగన్ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, జగనన్న వదిలిన బాణంగా ఏపీ రాజకీయాలలోకి శరవేగంగా చొచ్చుకొచ్చారు వైస్ షర్మిల. పార్టీ అధినేత అందుబాటులో లేకున్నా, పార్టీ క్యాడర్ లో అధైర్యం చోటు చేసుకోకుండా, రాజకీయ నాయకుడిగా జగన్ ప్రజా క్షేత్రానికి దూరమైన ఆయన పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేకత రానివ్వకుండా రాజన్న బిడ్డ అంటూ జగన్ ను ప్రజలకు అత్యంత చేరువ చేసారు షర్మిల.
పార్టీ కోసం, జగన్ కోసం ఇంత చేసిన చెల్లి షర్మిలకు వైస్ జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్… షర్మిల రాజశేఖర్ రెడ్డి రక్తమేనా.? అనే నీలి నింద, షర్మిల రెడ్డి కాదు శాస్త్రి అనే వ్యక్తిగత అవమాన భారం. అయితే ఇదంతా షర్మిల పట్ల వైసీపీ గతం తాలూకా చీకటి కోణం. అయితే తాజాగా వైసీపీ వర్తమానంలో కూడా ఇదే మాదిరి వైసీపీ పార్టీ కోసం, జగన్ విజయం కోసం నిరంతరం శ్రమించిన విజయసాయి రెడ్డి విషయంలో కూడా ఇదే అవమానం ఎదురయ్యింది.
Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?
జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయినా విజయసాయి రెడ్డి వైసీపీ లో కూడా నెంబర్ 2 గానే చక్రం తిప్పారు. వైసీపీ గెలుపు కోసం, జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం హస్తిన కేంద్రంగా కేంద్ర పెద్దలతో తెరవెనుక రాజకీయాలు నడిపిన విజయసాయి జగన్ ఆడిన తెరచాటు రాజకీయాలకు బలయ్యారు. 2019 వైసీపీ గెలుపులో షర్మిల కష్టం ఎంతుందో, సాయి రెడ్డి రాజకీయ చాణిక్యత కూడ అంటే బలంగా పని చేసింది.
అయితే అందుకు విజయసాయికి మిగిలింది…విశ్వసనీయత కోల్పోయిన నేత అనే గుర్తింపు, రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయిన నాయకుడు అనే అపవాదులు. ఇలా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరికి జగన్ నుంచి దక్కిన గౌరవాలు, సత్కారాలు చుస్తే పార్టీ కోసం శ్రమించే నేతల పట్ల జగన్ విలువ ఏపాటిదో.? వారి పట్ల ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో అర్ధమవుతుంది.
Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?
జగన్ ఆడిన ఈ జగన్నాటకంలో ఒకరు భవిష్యత్ లేని రాజకీయ పార్టీలో చేరి చుక్కాని లేని నవలా పయనిస్తున్నారు. మరొకరు అసలు రాజకీయాలకే పూర్తిగా మంగళం పడేసారు. ఇలా వైసీపీ నీలి నీడలో తమ రాజకీయ జీవితాలను శిధిలం చేసుకున్న వైస్ షర్మిల వైసీపీ గతం అయితే, విజయసాయి రెడ్డి వైసీపీ వర్తమానం, మరి వైసీపీ విజయం కోసం శ్రమించి, జగన్ గెలుపు కోసం ప్రణాళికలు వేసి వైసీపీ నీలి నీడలో తన రాజకీయ జీవితాన్ని అంతం చేసుకునే ఆ భవిష్యత్ వైసీపీ నాయకుడు ఎవరు.?