kcr-brs-party

ఫామ్ హౌస్ లో తండ్రి…ప్రచారంలో కొడుకు అన్నట్టుగా సాగుతున్న బిఆర్ఎస్ రాజకీయాలు పార్టీ క్యాడర్ ను ఆలోచనలో పడేస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. కానీ పార్టీ అధినేతగా కేసీఆర్ అటు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడం లేదు.

అలాగే ఇటు ప్రతిపక్ష నేతగా ప్రజా వాణి వినిపించడానికి అసెంబ్లీకి రావడం లేదు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ రాజకీయాలు నడిపిన కేసీఆర్ ఇప్పుడు అధికారానికి దూరమై ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే 2023 డిసెంబర్ లో వచ్చిన ఎన్నికల ఫలితాలతో ప్రజాక్షేత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్ తన ఈ మౌన దీక్షను 2025 సంక్రాంతి తరువాత విరమిస్తారా అంటూ ప్రకటించారు.

Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?

దీనితో అటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ ఆగమనం కోసం ఆశగా ఎదురు చూసారు. అయితే ఈ సంక్రాంతి వచ్చింది, వెళ్ళింది అయినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ గడప దాటి బయటకు రాలేదు. చివరికి ఈ ఫార్ములా రేస్ కేసు మీద కేటీఆర్ అరెస్టు అంటూ మీడియాలో వార్తలు ప్రచారమైన వాటి మీద కూడా కేసీఆర్ కనీసం స్పందించలేదు.

గతంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా మూడు రాజధానులు అంటూ హడావుడి చేసి, లేదు లేదు విశాఖే ఏపీ రాజధాని ఈ దసరాకు రాజధానిని విశాఖకు మారుస్తున్నాం అంటూ ప్రకటించి, లేదు లేదు దసరా కాదు సంక్రాంతి, ఇక ఆ తరువాత సంక్రాంతి కాదు శివ రాత్రి, లేదు లేదు శివ రాత్రి కాదు ఉగాది, ఉగాది కాదు వినాయక చవితి అంటూ క్యాలెండర్లో డేట్లు మార్చుకున్నారే కానీ రాజధానిని మార్చలేకపోయారు.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…


ఇప్పుడు కూడా అదే పంథాలో కేసీఆర్ ఈ సంక్రాంతి నుంచి ప్రత్యక్ష రాజకీయాలు చేస్తూ ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నా అంటూ ప్రకటించి జగన్ మాదిరి మడం తిప్పేశారు. ఇక రేపోమాపో శివరాత్రి రానుంది. ఇక అప్పుడైనా శివ పూజ తో కేసీఆర్ రాజకీయ తాండవం చేయబోతున్నారా.? లేక మరో పండగ ముహూర్తం కోసం ఎదురు చూడమని పార్టీ క్యాడర్ కు సంకేతాలు ఇవ్వనున్నారా.?