ఫిరాయింపులకు వ్యతిరేకం అనే పేరుతో వైకాపా వచ్చే శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అసలకైతే జగన్ పాదయాత్రలో బిజీగా ఉండి అసెంబ్లీ కి వెళ్లకూడదని డిసైడ్ చేసారు. అసెంబ్లీ లో అంత తానే వ్యవహరిస్తారు జగన్. ఆ స్థానం వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకనే మొత్తానికి బహిష్కరించారని వైకాపాలో టాక్.
మరోవైపు ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. అయినాసరే వైకాపా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. తాము అసెంబ్లీ కి రావాలంటే ఫిరాయింపుల మీద ఏక్షన్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.
కొందరైతే ఫిరాయింపులపై ఏక్షన్ తీసుకుంటే అసెంబ్లీ కి వచ్ఛే విషయంపై ఆలోచన చేస్తాం అంటున్నారు. అయితే ఈ ఆలోచించడం ఏంటో ఎవరికీ అర్ధం కాదు. అసెంబ్లీ కి రాము అని ఎవరిని బెదిరిస్తున్నట్టు. వైకాపా అసెంబ్లీ కి రాకపోతే నష్టం ఆ పార్టీకే. ప్రజాసమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పోతాది.
అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ కు అత్యధిక మీడియా కవరేజ్ వస్తుంది ఇప్పటిదాకా. ప్రతిపక్షం సభలో లేకపోతే పాలకపక్షం ఇంచక్కా తనకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకునే వెళ్ళిపోతారు. ఈ విషయాన్నీ జగన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మరో వైపు 6వ తారీఖు నుండి జగన్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.
6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని జగన్ నమ్మకం. పాదయాత్ర తరువాత 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర కూడా చెయ్యబోతున్నారు.


