
అతివేగం ప్రమాదకరమని వైసీపీ ఇప్పటికి గ్రహించకపోవడం చాల ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. ఎన్నికల ప్రచారం మొదలుకాకముందు నుంచే వై నాట్ 175 అంటూ మోతమోగించిన వైసీపీ ఫలితాల విడుదల రోజు 11 సీట్లతో చతికలపడింది.
అలాగే జూన్ 4 న కొట్టండి జేజేలు, పెట్టండి డీజేలు అంటూ పార్టీ శ్రేణులను సంబరాలకు ముందే సిద్ధం చేసి నవ్వులపాలైయింది. జూన్ 9 న విశాఖలో వైసీపీ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరనుంది, వైస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అంటూ ప్రచారం చేసారు.
Also Read – అయ్యో ‘నానీ’లు ఇలా అయిపోయారే..!
అక్కడితో ఆగకుండా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి వస్తున్న జనసముద్రంతో విశాఖ నగరం కిక్కిరిసిపోనుంది అంటూ ఎక్కడా లేని హడావుడి సృష్టించిన వైసీపీ, సముద్రపు కేరటం మాదిరి ఎంత ఆవేశంగా ముందుకొచ్చిందో అంతే తొందరగా వెనక్కి తిరిగి వెళ్ళింది. ఇలా వైసీపీ ఆవేశంలో ఎన్నిసార్లు తొందర పాటు ప్రకటనలు చేసినా చివరికి ప్రజల ముందు తలదించుకోవడమే అవుతుంది.
ఈ రోజు బాపట్ల జిల్లా ఈపురపాలెంలో యువతి పై ఆత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వార్తలు రావడంతో అప్పటికప్పుడు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఘటన పై దర్యాప్తు చేయాలంటూ హోమ్ మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే హోమ్ మంత్రి అనిత కూడా ఘటనాస్థలికి బయలుదేరారు.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
జరిగిన ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అలాగే బాధితులకు అండగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు దాని అమలుకు తగ్గ చర్యలు కూడా జరుగుతున్నప్పటికీ వైసీపీ మళ్ళీ తొందరపడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడవారి పై జరిగిన దారుణాలకు లెక్కేలేదు. అయినా ఏ ఒక్కరోజు ఆ సంఘటనల పై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కాదు కదా కనీసం మహిళా హోమ్ మంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు.
ఎదో రాష్ట్రంలో ఒకటి అర ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రతిపక్షాలు అంతలా గగ్గోలుపెట్టాలా అంటూ మహిళా మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేతలే మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేసారు. హోమ్ మంత్రి వనితా అయితే ఏదో దొంగతనానికి వెళ్ళారేకాని ఆ ఉద్దేశం లేదు అంటూ నిందితులను వెనకేసుకొచ్చారు. ఇలా గురివింద గింజంలా తన కింద అంత నలుపు పెట్టుకుని మరొకరిపై బురద జల్లితే నవ్వుతారు అనే కనీస సృహ కూడా వైసీపీకి ఉండడం లేదు.
Also Read – అమరావతిలో బసవతారకం….
తప్పు జరిగింది…శిక్ష పడాలి. దానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వలికదా.? సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశాలిచ్చింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు కొంత సమయం ఇచ్చి అప్పటికి కేసు ముందుకు సాగకపోతే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం, హక్కు వైసీపీ పార్టీకి కచ్చితంగా ఉంటుంది.
అలాకాకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పార్టీని నిందిస్తాం అంటూ ఇలా సమయం సందర్భం లేకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ “కూటమి ప్రభుత్వంలో మాహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మహిళల పై అప్పుడే దారుణాలు మొదలయ్యాయని, ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి.? అంటూ వైసీపీ తన సోషల్ మీడియా లో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
దీనితో వైసీపీ కి ఎందుకింత తొందర.? అంటూ కౌంటర్లు వసున్నాయి. జరిగిన ఘటన ఖండించదగ్గ అంశమే అయినప్పటికీ బాబు, పవన్, పురందరేశ్వరి లను దీనికి భాద్యులను చేస్తామా.? గత ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు జరిగిన ప్రతి అన్యాయానికి జగన్ బాధ్యత వహించాడా.? ఇంకా కొత్త ప్రభుత్వం పూర్తిగా కొలువు తీరనేలేదు. అప్పుడే ముగ్గురు పార్టీల అధినేతల మీద వైసీపీ తన కడుపు మంటను వ్యక్త పరచడం కూడా తొందర పాటు చర్యగానే భావించాలి.