
గతేడాది జరిగిన 17 వ ఐపీఎల్ సీజన్ లో ట్రోఫీ విజేత కోల్కతా జట్టు కు కెప్టెన్ గా వ్యవహరించాడు శ్రేయాస్ అయ్యర్. 2022 లో కూడా ఈ జట్టు కి ఆయనే సారధి అయినప్పటికీ, ఆ ఏడు కోల్కతా జట్టు నుండి మెరుగైన ఫలితాలు రాలేదు. 2023 లో సర్జరీ చేయించుకోవటం తో ఐపీఎల్ కు అందుబాటులో లేదు అయ్యర్.
2024 సీజన్ ప్రారంభానికి మునుపు, ఈ ఆటగాడి కెప్టెన్సీ పై పెద్ద ఆశలు, అంచనాలు లేవనే చెప్పాలి. అయితే, అందరి ఊహలను తల క్రిందులు చేసి ఐపీఎల్ 2024 లో విధ్వంసం సృష్టించిన సన్-రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్స్ లో చిత్తు గా ఓడించి కప్ ను ఎగరేసుకు పోయారు కోల్కతా నైట్ రైడర్స్.
Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే
అయితే, ఏ ఫ్రాంచైజ్ అయినా తమ జట్టుకు ట్రోఫీ ను అందించిన సారధి ని అంత సులువుగా జట్టు నుండి బయటకు వదులుకోరు. కానీ, కోల్కతా జట్టు మాత్రం అయ్యర్ ను రెటైన్ చేసుకోలేదు సరి కాదు కదా, ఆక్షన్ లో అయ్యర్ ను దక్కించుకోలేదు. దీనితో, ఓపెన్ ఆక్షన్ లోకి వచ్చిన అయ్యర్ ఏకంగా 26.75 కోట్లు పలికి, అప్పటివరకు వేలం లో అదే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రకెక్కాడు.
అంత భారీ అమౌంట్ పెట్టి అయ్యర్ ను సొంతం చేసుకున్నారు పంజాబ్ జట్టు. ఇందుకు ఆ జట్టు కోచ్ పాంటింగ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. గతంలో, అయ్యర్ తో పని చేసిన అనుభవం ఉన్న పాంటింగ్- పంజాబ్ యాజమాన్యానికి మరల అయ్యర్ ను కెప్టెన్ గా సూచించారు. వీరిద్దరూ ఢిల్లీ జట్టుకు కలిసి పని చేసిన సీజన్లు ఉన్నాయి.
Also Read – భగవద్గీతని సూర్య చంద్రులని ఎవరో గుర్తించాలా?
ఇక, 17 సీజన్ల నుండి ఆ ఐపీఎల్ కప్ కోసం తపిస్తున్న పంజాబ్ జట్టు కూడా ఖర్చు ఎంతైనా పర్వాలేదు తమకు అయ్యర్ కావాల్సిందే అన్నట్లు అయ్యర్ ను దక్కించుకున్నారు. ప్రస్తుతం అయ్యర్ ఫామ్ అద్భుతంగా ఉండటం, బలమైన జట్టు తయారవటం, కోచ్ గా పాంటింగ్ ఉండటం, ఇలా ఇవన్నీ చూస్తుంటే పంజాబ్ జట్టు ఈసారి తమ తొలి ట్రోఫీ ను గెలుచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.