‘కన్నీరు’ పెట్టిన పల్లె ‘పండుగ’ చేసుకుంటుందా.?

palle-panduga

గ్రామాల అభివృద్దే దేశాన్ని పట్టుకొమ్మలు అనే నానుడి నుంచి గ్రామాల విచ్ఛిన్నమే రాజకీయం అనే స్థాయికి ఆంధ్రప్రదేశ్ లోని పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.

ADVERTISEMENT

గత ఐదేళ్లు అభివృద్ధిని పక్కన పెట్టి బటన్ నొక్కే కార్యక్రమంలో బిజీగా ఉన్న జగన్ తన ప్రభుత్వ పాలనలో ఏనాడూ గ్రామా సభలు నిర్వహించి ఆయా గ్రామాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన మీద ద్రుష్టి పెట్టిందే లేదు.

అలాగే పంచాయితీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లించి తన రాజకీయ అవసరాలకు వినియోగించుకున్నారు జగన్. గత వైసీపీ పాలనలో గ్రామ పంచాయితీ అధిపతులైన సర్పంచులు తమ గ్రామ అభివృద్ధికి, తాగు నీరు, రోడ్లు వంటి కనీస వసతులకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని జగన్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.

అలాగే గ్రామస్థాయి విద్యాలయాలలో కనీస వసతులు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచలేకపోతున్నాం అంటూ సర్పంచులు గగ్గోలు పెట్టుకున్నారు. సమయానికి కరెంటు అందుబాటులో ఉండక, ప్రయాణాలకు రోడ్లు సరిగా లేక, తాగడానికి స్వచ్ఛమైన మంచి లభించక, పంట పొలాలకు అవసరమైన కాలువల పూడిక తీయలేక గత ఐదేళ్లు పల్లె కన్నీరు పెట్టింది.

అయితే “ఈ పల్లెల కన్నీటి ఉసురు వైసీపీ ప్రభుత్వం ఉసురు తీసింది”. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అందునా కూటమిలో అత్యంత బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకోవడంతో పల్లెలకు మహర్దశ పట్టినట్టయ్యింది.

చంద్రబాబు నాయకత్వంలో, పవన్ ఆదేశాలతో రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమాలను నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. దీనితో గత ఐదేళ్లుగా వైసీపీ నిర్లక్ష్యానికి నిర్వీర్యమై పోయిన పంచాయితీ రాజ్ శాఖ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తుంది. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా గ్రామ సభలు నిర్వహించి అక్కడి స్థానిక సమస్యలను అవగాహన చేసుకుంది.

అలాగే ఆ సమస్యల పరిష్కరానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ స్థానికంగా పరిష్కరించాల్సిన ముఖ్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఆ దిశగా గ్రామ సర్పంచులను ఆదేశించారు ఆ శాఖ మంత్రి పవన్.

అలాగే కూటమి ప్రభుత్వం సర్పంచులకు వారి బాధ్యతతో పాటుగా గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా లాక్కున్న వారి హక్కులను తిరిగి కల్పిసుంది అంటూ సర్పంచులకు తమ సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారాన్ని కట్టబెట్టింది. 13326 గ్రామాలలో 4500 కోట్లతో 30 రకాల పనులను ఈ సంక్రాతి పండుగకు పూర్తి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

అందుకు తగ్గట్టుగానే ఇటు పంచాయితీ శాఖ మంత్రి పవన్, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖ ఉద్యోగులకు, అధికారులకు పనులు పూర్తి చేయడానికి సంక్రాంతి పండుగను డెడ్ లైన్ గా విధించారు. గత ఐదేళ్ల తమ అరణ్యరోధనకు నేడు న్యాయం జరుగుతుంది. నాటి ప్రభుత్వ వైఖరితో కన్నీరు పెట్టుకున్న పల్లె నేటి ప్రభుత్వ నిర్ణయంతో పండుగ చేసుకుంటుంది అంటూ ఆయా గ్రామాల ప్రజలు కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories