జగన్ గత పదేళ్లుగా బెయిలు మీద ఉంటూ ముఖ్యమంత్రిగా డ్యూటీ చేసారు. అయితే అక్రమాస్తుల సంపాదన మీద అరెస్టైన ఖైదీ పాలన చేస్తే ఎలా ఉంటుందో దాని తాలూకా విధ్వంసం ఏ స్థాయికి చేరుకుంటుందో గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించారు వైస్ జగన్.

తానూ ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది అనే నెపంతో తన కేసుల విచారణకు ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరు కావాల్సిన జగన్ అందుకు తనకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాలను ఆశ్రయించి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?

అయితే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ బెయిలు ముఖ్యమంత్రి సేవలు ఇక మాకు చాలు మహా ప్రభో అంటూ 151 సీట్లతో 2019 ఇచ్చిన మాన్డేటరీ ని 11 సీట్లకు కుదించి ఏపీలో వైసీపీ ఫ్యాన్ కు సమాధి కట్టారు ఓటర్లు. దీనితో జగన్ పాత కేసులన్నీ మళ్ళీ కొత్తగా తెర మీదకు వచ్చాయి.

ముఖ్యమంత్రి హోదాలో తనకు మినహాయింపు కావాలని ఇన్నాళ్లుగా విచారణకు సాకులు చెప్పిన జగన్ కు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో న్యాయస్థానాలు జగన్ కు ఇచ్చిన ఈ మినహాయింపును తొలగించాలని కోరుతున్నారు సీబీఐ అధికారులు.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్ట్ లో ఈ రోజు జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే రేపు జగన్ విచారణకు సహకరిస్తూ కోర్టుకు వెళతారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.

దీనితో కోర్టుకు రావాలి జగన్..కావాలి జగన్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో జగన్ ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటమి భారంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, కూటమి నేతల విమర్శలు ఎదుర్కొంటు ఇటు ఆంధ్రాలో ఉండలేక, కోర్టులకు హజరవ్వలేక అటు హైద్రాబాద్ కు వెళ్లలేక జగన్ ఈ ఐదేళ్ల కాలాన్ని ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాలి.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?

దీనికి తోడు తెలంగాణలో తన ఆప్త మిత్రుడు కేసీఆర్ కూడా అధికారానికి దూరమై, తన కుటుంబ సభ్యులతో పాటుగా తానూ కూడా కేసులను ఎదుర్కోవడానికి సిద్దమైన ఈ తరుణంలో జగన్ ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు.? అనేదాని మీద చర్చ మొదలయ్యింది. జగన్ మళ్ళీ జైలుకు వెళ్లే సందర్భం వస్తే ఈసారి వైసీపీ పార్టీని భుజం కాయడానికి వైస్ షర్మిల కూడా తోడుగా లేరు.