హామీలు అమలు చేసినా, చేయకపోయినా వైసీపీ ఏడ్పులు కామన్?
ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.
మొదట జిల్లా సరిహద్దుల వరకు మాత్రమే అనుకున్నా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఇంతకాలం ఈ హామీ అమలు చేయలేదని, మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేతలు, ఇప్పుడు అమలు చేస్తుంటే కూడా ఏడ్పులు ఆపడం లేదు.
రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ, “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఇంతకాలం మభ్యపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు పల్లెవెలుగు వంటి కొద్ది బస్సులకే పరిమితం చేస్తూ మరోసారి మోసం చేయబోతున్నారు” అని విమర్శించారు.
అంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేసినా, చేయకపోయినా వైసీపీ ఏడ్పులు కామన్ అన్న మాట!
ఈ హామీ అమలుకు చంద్రబాబు ఏడాది సమయం తీసుకోవడంతో ఇక ఎన్నటికీ జరగదని వైసీపీ భావించి ఉండవచ్చు. అందుకే సమయం దొరికినప్పుడల్లా కాకిలా పొడుస్తూనే ఉండవచ్చని అనుకుందేమో? కానీ చంద్రబాబు నాయుడు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ షాక్ తట్టుకోలేకే వైసీపీ ఈవిదంగా ఏడుస్తోందేమో?
రేపు ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, దీనిని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నించకుండా ఉంటుందా? వైసీపీ మహిళలతో బస్సులు నింపి, బస్సులలో రభస సృష్టించినా ఆశ్చర్యం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు కూడా ముందే వ్యూహం సిద్ధం చేసుకోవడం మంచిది.






