ఏపీ బడ్జెట్ – జీడీపీలో నెంబర్ ‘1’

Yanamala-Rama-Krishnudu-Andhra-Pradesh-Budget2017ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రాష్ట్ర‌ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ 2017-18వ ఏడాది బ‌డ్జెట్ 1,56,999 కోట్ల‌ని తెలిపారు. విజ‌న్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని, అభివృద్ధిని వేగ‌వంతం చేసేందుకు రాజధానిని అమ‌రావ‌తికి తరలించామని, పరిపాలన అమ‌రావ‌తికి రావ‌డం వ‌ల్ల ఆర్థికాభివృద్ధి జ‌రుగుతోందని, చంద్ర‌బాబు నాయుడి ఆధ్వ‌ర్యంలో ఎన్నో స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామని, ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూనే రాజ‌ధానిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ADVERTISEMENT

రెవెన్యూ 1,25,911 కోట్ల‌ని, నిర్వ‌హ‌ణ వ్య‌యం 1,087 కోట్ల‌ని, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు 8,790 కోట్లని అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స్థూల జాతీయోత్ప‌త్తిలో దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంద‌ని, 192 రోజుల్లోనే నూత‌న శాస‌న‌స‌భ భ‌వ‌నం నిర్మించుకోగ‌లిగామ‌ని, రాష్ట్రం ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను అందుకుందని, శక్తి, ఇంధ‌న‌, సుల‌భ‌త‌ర వాణిజ్యంలో రాష్ట్రం పుర‌స్కారాలు అందుకుందని, మ‌న రాజ‌ధాని న‌గ‌రం దేశానికే ఆద‌ర్శ‌న‌మూనాగా నిల‌బ‌డ‌నుందని చెప్పారు.

ఏపీ రాజ‌ధానిలో పెట్టుబడులు పెట్ట‌డానికి ఎన్నో కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయ‌ని, ఆన్‌లైన్‌ లో అన్ని అనుమ‌తులు ఇస్తూ దేశంలోనే మొద‌టి స్థానంలో ఏపీ ఉందని, జీఎస్‌టీ వ‌ల్ల రాబోయే కాలంలో రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. కృష్ణా పుష్కరాల ద్వారా మ‌రోసారి మ‌న సంస్కృతిని చాటామని, భార‌తీయ సైన్స్ కాలేజ్ నిర్వ‌హించిన ప‌ద్ధ‌తి అంద‌రినీ ఆకర్షించింద‌ని, జాతీయ మ‌హిళా సాధికార‌త స‌ద‌స్సు అద్భుతంగా నిర్వ‌హించామ‌ని, అమ‌రావ‌తిని ఓ ప‌ర్యాట‌క న‌గ‌రంగా కూడా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు, రాష్ట్రంలో ఉన్న వ‌న‌రులను దృష్టిలో ఉంచుకొని తాము ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు.

జ‌ల‌వ‌న‌రులు, వ‌ర‌ద నివార‌ణ‌కు 701 కోట్లు
ర‌వాణాకు 1,677 కోట్లు
సాధారణ విద్యకు 19,897 కోట్లు
సాంకేతిక విద్యకు 728 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ‌కు 6,574 కోట్లు
తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యానికి 1,049 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి 3,528 కోట్లు
నీటిపారుద‌ల‌కు 12,770 కోట్లు
ఇప్ప‌టివ‌ర‌కు రైతు రుణ‌మాఫీకి చెల్లించింది 11 వేల కోట్లు
రుణ‌మాఫీ త‌దుప‌రి చెల్లింపున‌కు 3,600 కోట్లు
సామాజిక భ‌ద్ర‌త, సంక్షేమ పింఛ‌న్ల‌కు 1,636 కోట్లు
సంక్షేమ శాఖ‌కు 1,234 కోట్లు
సాంస్కృతిక శాఖ‌కు 78 కోట్లు
క్రీడ‌లు, యువ‌జ‌న‌ స‌ర్వీసుల శాఖ‌కు 728 కోట్లు
మ‌సీదుల్లో ప‌నిచేసే ఇమామ్‌లకు 24 కోట్ల కేటాయింపు
ఖ‌నిజాభివృద్ధి శాఖ‌కు 1,666 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి 9,487 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి 3,528 కోట్లు
సూక్ష్మ సేద్యం, ఆయిల్ ఫాం ఇత‌ర రంగాల‌కు 1,015 కోట్లు
రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి కార్య‌క‌లాపాల‌కు 1,061 కోట్లు
పశుగ‌ణాభివృద్ధికి 1,112 కోట్లు
మ‌త్స్యశాఖ‌కు 282 కోట్లు
చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు 2,086 కోట్లు
శాస్త్ర సాంకేతిక శాఖ‌కు 29 కోట్లు
శాంతి భ‌ద్ర‌త‌ల‌కు 5,221 కోట్లు
అట‌వీశాఖ‌కు 383 కోట్లు
నిరుద్యోగ భృతి 500 కోట్లు
అన్నా క్యాంటీన్‌లు 200 కోట్లు,
మరుగుదొడ్ల నిర్మాణం 100 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవ 100 కోట్లు
ఎన్టీఆర్ సుజల స్రవంతి 100 కోట్లు
విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి 450 కోట్లు,
షాదీ ఖానాలకు 1500 కోట్లు
ఆరోగ్య శ్రీ 1000 కోట్లు
రెవెన్యూ లోటు 416 కోట్లు
ఆర్థిక లోటు 23,054 కోట్లు.

ADVERTISEMENT
Latest Stories