నీతీ.,న్యాయం,ధర్మం,చట్టాలు.. అంటూ వైసీపీ పెద్దలు మీడియా ముందుకు వచ్చి నీతీ ప్రవచనాలు వల్లిస్తుంటే గురువింద తన కింద ఉన్న మచ్చను చూసుకోలేదు అనే సామెతను గుర్తుచేస్తుకుంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.
చంద్రబాబు పాపం పండింది.!న్యాయమే గెలిచింది, ధర్మం నిలిచింది, చట్టం తన పని తానూ చేసింది, చట్టాలు గర్వంతో తలెత్తుకుని తిరుగుతున్నాయి, ఇది ప్రజాస్వామ్య విజయం, రాజ్యాగం సాధించిన విజయం అంటూ వైసీపీ పెద్దలు,రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి వల్లిస్తున్న నీతీ సూక్తులివి.
ప్రభుత్వ సలహాదారు హోదాలో సజ్జల మాట్లాడుతూ బాబు కేసులో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే 14 రోజులు రిమాండ్ కి పంపడం..,ఆ తరువాత అరెస్ట్ చేయడం, బెయిల్ తిరస్కరించడం అన్ని న్యాయ పరంగా రాజకీయాలతో సంబంధం లేకుండా విధానపరంగా జరిగాయి అంటూ సెలవిచ్చారు. ఏ ‘సాక్ష్యాలు’… ఏ ‘సాక్షి’లో ఉన్నాయో కూడా సెలవిస్తే బాగుంటుంది అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
సాక్ష్యాలు ఉంటేనే రిమాండుకి తరలిస్తారు, సాక్ష్యాలు ఉంటేనే అరెస్టులు చేస్తారు, సాక్ష్యాలు ఉంటేనే బైలు తిరస్కరిస్తారు, ప్రతిపక్ష నేతల అరెస్టులకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు అని అన్ని తెలిసిన మీరు మరి జగన్ కేసులు మాత్రం అక్రమ కేసులని, రాజకీయ కక్ష సాధింపు చర్యలని, ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తమ పై అక్రమ కేసులు బనాయించారని గగ్గోలు పెట్టిన విషయం సజ్జల గారు మరిచినట్టున్నారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
తండ్రి లేని పిల్లోడిని అన్యాయంగా కేసుల్లో ఇరికించారు అంటూ మొత్తం వైస్సార్ కుటుంబమంతా కలసి ఓదార్పు యాత్రలంటూ., పాదయాత్రలంటూ రోడ్ల మీద తిరిగి అన్యాయంగా జగన్ ను జైలుకు పంపారు అంటూ మీడియా ముందు పలికిన పలుకులను మరోసారి గుర్తుచేసేపనిలో పడ్డారు టీడీపీ సోషల్ వింగ్. సాక్ష్యాలు ఉంటేనేగా జైలుకు వెళ్ళేది కానీ అప్పుడు ఈవిషయం మీకు తెలియలేదా.? అంటూ వైసీపీ నేతలకు చురకలు వేస్తున్నారు.
కొన్ని వేల కోట్ల అవినీతి కేసులో A1 ముద్దాయిగా ఉండి, బెయిల్ మీద ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీ అధినేత జగన్ ను ఎమనాలి అంటూ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. జగన్ తన ముఖ్యమంత్రి పదవి కోల్పోతే ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు కావాల్సి వస్తుంది అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకుంటే బాగుంటుంది అంటున్నారు బాబు అనుచరులు. జగన్’ ఫ్రైడే’ ముఖ్యమంత్రి అందుకే రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసిన ఫ్రైడే చూసి చేస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కోడికత్తి కేసులో కోర్టులకు హాజరు కాకుండా సంస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరో.., బాబాయి గొడ్డలి వేటును గుండెపోటు గా ఏమార్చింది ఎవరో., వివేకానంద రెడ్డి కేసులో జైలుకు వెళ్లకుండా ముద్దాయిలను కాపాడుతుంది ఎవరో., తన రాజకీయ అవసరానికి తల్లిని, చెల్లిని అడ్డుపెట్టుకొని చివరకు రాష్ట్రాన్ని దాటించింది ఎవరో ప్రజలందరికి తెలుసు అంటూ లోకేష్ తన తండ్రి పై జరుగుతున్న దాడులకు దీటైన జవాబే ఇచ్చారు. లోకేష్ మాట్లాడుతూ దొంగే దొంగా…దొంగా అని అరిచినా చందంగా రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయన్నారు.



