
గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారితో తమకు సంబందం లేదనడం వైసీపికి పరిపాటిగా మారింది.
వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని అతికిరాతంగా హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనితో మాకేమీ సంబంధం లేదని తప్పించుకుంది. కానీ నేటికీ అనంతబాబు వైసీపితోనే ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
ఇదేవిదంగా మరో వైసీపి ఎమ్మెల్సీ జకియా ఖానం తిరుమల బ్రేక్ దర్శనం టికెట్స్ బ్లాకులో అమ్ముకుంటే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెతో వైసీపికి సంబంధం లేదని, ఆమె టిడిపిలో చేరారని చెపుతూ ఆ నేరారోపణని టిడిపి మెడలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆమె టిడిపిలో చేరలేదు కానీ చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నందున ఆమె చేసిన ఈ తప్పుతో వైసీపికి సంబంధం లేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
నేటికీ ఆమె వైసీపి ఎమ్మెల్సీగానే ఉన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆమె ఇచ్చిన సిఫార్సు లేఖలో కూడా అదే ఉంది.
ఆమె ఆ సిఫార్సు లేఖ ఇచ్చేందుకు ఆరుగురికి రూ.65,000 వసూలు చేశారని బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే విచారణ జరిపి నిజమని ధృవీకరించారు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు జకియా ఖానం, ఆమె పీఏ చంద్రశేఖర్, ఆమె పీఆర్వో కృష్ణతేజలపై కేసు నమోదు చేశారు.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు ఈ విషయం తెలియగానే ముందుగా బొత్స సత్యనారాయణ ఈవిదంగా మాట్లాడారు.
ఒకవేళ ఆమె నిజంగా టిడిపిలో చేరిపోయి ఉంటే, టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుపతి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసేవారా?అంటే కాదనే చెప్పవచ్చు.
కానీ ఎన్నికలవగానే వాలంటీర్లను వదిలించుకున్నట్లు, తిరుమల వ్యవహారంలో మళ్ళీ వైసీపి ఎమ్మెల్సీ పేరు బయటకు పొక్కడంతో బొత్స సత్యనారాయణ హడావుడిగా ఆమెతో వైసీపికి సంబందం లేదని ప్రకటించేశారు. కానీ ఆమె సంతకం చేసి ఇచ్చిన సిఫార్సు లేఖ సంబందం ఉందని చెపుతోంది కదా?
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇప్పటికే వైసీపి, టిడిపి రెంటికీ తలలు బొప్పి కట్టాయి. కనుక ఇటువంటి కక్కుర్తి పనులకు, పాల్పడే వ్యక్తులను పార్టీలకు దూరంగా ఉంచడం చాలా అవసరం.