ప్రభాస్ ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లోకి మరొకరు

prabhasకృష్ణంరాజు సోదరుడు కుమారుడు ప్రభాస్ …రెబెల్ స్టార్ నటన వరసుడు అయిపోయాడు. ఇప్పుడు, కృష్ణంరాజు కుటుంబం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో ప్రవేశం జరుగుతుంది. కృష్ణంరాజు కు ముగ్గురు కుమార్తెలు. కృష్ణంరాజుపెద్ద కుమార్తె ప్రసీధ, ప్రభాస్ తదుపరి చిత్రం… రాధే శ్యామ్ తో నిర్మాతగా అడుగుపెడుతున్నారు.

యువి క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో పాటు ఆమె చిత్ర నిర్మాతల్లో ఒకరిగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో క్రెడిట్ దక్కించుకున్నారు. చిత్రాలతో పాటు, ఈమె ఓటీటీ కంటెంట్ నిర్మాణం‌లోకి ప్రవేశించడానికి యోచిస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

రాధే శ్యామ్ 2021 విడుదలకు కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కోసం ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రభాస్ సాహో చిత్రం ఫెయిల్ కావడంతో బాహుబలి తో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటివరకూ కంఫర్మ్ కాలేదు. ఈ సినిమా హిందీ హక్కులను టి. సిరీస్ తీసుకొంది. టి.సిరీస్ పాలసీ ప్రకారం ఒక సంగీత దర్శకుడికి రెండు పాటలుకి మించి ఇవ్వరు. అంటే ఒకే సినిమా ఆల్బంలో ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పాటలు ఇస్తారు.

ADVERTISEMENT
Latest Stories