వైఎస్ ఆర్ కాంగ్రెస్ మరో సెల్ఫ్ గోల్ వైపు వెళ్తుందా? ఎంతో ఇంపార్టెంట్ ఐన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, వైసిపి కి చెందిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ అంతవరకు అసెంబ్లీకి వెళ్లరాదని ఆ పార్టీ నిర్ణయించింది.
జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న మాట వరుసకు ఈ ఫిరాయింపుల గోడవను పైకి తెచ్చింది. నలుగురు మంత్రులను తొలగించి, ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన వెంటనే తాము అసెంబ్లీకి వస్తామని ప్రకటించింది. నవంబర్ 10 నుండి వర్షాకాల సమావేశాలు జరుగుతాయి.
10 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం పోగొట్టుకుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డికి అత్యధిక మీడియా కవరేజ్ దక్కింది. ఇప్పుడు ఆ అవకాశం పోయింది. మరోవైపు నవంబర్ 6 నుండి జగన్ తన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.


