జగన్ సిఎం అయ్యాక, మళ్ళీ 500, 1000 నోట్లు?

YS Jagan Black Money 500 1000 Notes Banned - Discontinuedప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో దేశం మొత్తం కదిలింది. తిట్టే వాళ్ళు తిడుతున్నారు… పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు… ఏది ఏమైనా దేశం మొత్తం మోడీ అన్న ఒకే ఒక్క పేరును స్మరిస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ మోడీపై తమకున్న అభిప్రాయాలను సోషల్ మీడియా వ్యక్తపరుస్తుండడంతో… మొత్తం మీడియా నిండా మోడీ నిర్ణయం తప్ప మరొక అంశం లేనట్లుగా మారిపోయింది. అలాగే మోడీ తీసుకున్న ఓ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓ జోక్ హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

అదేమిటంటే… రాజధాని అమరావతిలో రైతుల వద్ద ప్రభుత్వం తీసుకున్న భూములను, తానూ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానని వైసీపీ అధినేత ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో… అలాగే ఈ 500, 1000 నోట్లపై కూడా జగన్ అభిప్రాయంగా సోషల్ మీడియాలో ఎటకారంతో కూడిన జోకులు పేలుతున్నాయి. “మా జగనన్న సిఎం అవుతాడు, ఈ అన్యాయస్తులు తీసేసిన 500, 1000 రూపాయల నోట్లను మళ్ళీ తెస్తాడంటూ” పడుతున్న సెటైర్లకు కొదవలేదు. అవినీతి, అక్రమాస్తుల కేసులు జగన్ పై ఉండడంతో ఈ జోకులకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories