YS Jagan Court Phobia

దేశంలో సామాన్య పౌరులు పాస్ పోర్టుకి దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు పది రోజులలోనే లభిస్తోంది. నిత్యం వేల మందికి పాస్ పోర్టులు మంజూరవుతునే ఉన్నాయి… నిత్యం వేలమంది సామాన్య ప్రజలు విదేశాలకు వెళ్ళివస్తునే ఉన్నారు.

Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!

కానీ ఏపీని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించిన జగన్‌కు పాస్ పోర్టు రావడం లేదు.. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళలేరు! ఈ రెండూ స్వయంకృతాలే!

ఆక్రమాస్తుల కేసులలో మళ్ళీ జైలుకి వెళ్ళకుండా తప్పించుకునేందుకు దాదాపు పుష్కర కాలంగా ఆ కేసులు కొలిక్కి రాకుండా నడిపిస్తూనే ఉన్నారు. ఆ కేసులలో బెయిల్‌ షరతులతో విదేశాలకు వెళ్ళాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. కనుక జగన్‌ ఎప్పుడు విదేశాలకి బయలుదేరాలన్నా తప్పనిసరిగా కోర్టులో దరఖాస్తు చేసుకోవలసిందే!

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన జగన్‌కు ఇదేమీ అవమానంగా అనిపించడం లేదా?అంటే తప్పక అనిపిస్తుంది. కానీ దాని కోసం ఆక్రమాస్తుల కేసుల విచారణ కొలిక్కి రానీయనిస్తే ఇంకా ప్రమాదం. కనుక ఆ ప్రమాదం కంటే ఈ అవమానమే మేలని సరిపెట్టుకోక తప్పడం లేదు.

జగన్‌కి పాస్‌పోర్టు ఇవ్వబోమని ఎవరూ చెప్పడం లేదు. దాని కోసం విజయవాడలో ప్రజా ప్రతినిధుల కోర్టు నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) సమర్పించాలని పాస్‌పోర్టు కార్యాలయం సూచించింది. అందుకు కోర్టు అంగీకరించింది కూడా.

Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!

కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కనుక స్వయంగా కోర్టుకి వచ్చి రూ.20,000 పూచీకత్తుతో ఓ బాండ్ సమర్పించాలని సూచించింది.

ఆక్రమస్థుల కేసులలో న్యాయవాదులకు ఏళ్ళ తరబడి కోట్ల రూపాయిలు ఫీజుగా చెల్లిస్తున్న జగన్‌కు రూ.20,000 పూచీకత్తు చెల్లించడం పెద్ద లెక్క కాదు. కానీ కోర్టుకి హాజరయ్యేందుకు ఆయన నిరాకరిస్తున్నారు.

మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావాలో స్వయంగా హాజరు కాకుండా ఉండేందుకు హైకోర్టుకి వెళ్ళి జగన్‌ అనుమతి తెచ్చుకున్నారు. నిన్న దీనిపై కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు.




జగన్‌ కోర్టుకి వెళ్ళి పూచీకత్తు సమర్పిస్తే ఎన్‌ఓసీ, దాంతో పాస్‌పోర్టు వచ్చేస్తాయి. కానీ ఆక్రమస్థుల కేసులో కోర్టు మెట్లు ఎక్కితే 16 నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. కనుక కోర్టు మెట్లు ఎక్కితే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయం ఏర్పడిన్నట్లుంది. బహుశః అందుకే ఆక్రమాస్తుల కేసులు, కోడికత్తి కేసు, ఇప్పుడీ పాస్‌పోర్టు కేసులలో జగన్‌ కోర్టు గడప తొక్కేందుకు భయపడుతున్నట్లున్నారు. కానీ డజన్ల కొద్దీ కేసులను ఏళ్ళ తరబడి నడిపిస్తున్న జగన్‌కి కోర్టు-ఫోబియా ఉంటే ఆశ్చర్యమే కదా? జగన్‌ కోర్టు మెట్లు ఎక్కేందుకు ఇష్టపడకపోయినా కూటమి ప్రభుత్వం ఏదో రోజు జగన్‌కి ఆ భాగ్యం కల్పించకుండా ఉంటుందా?